Simhasanam in Yoga | సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట

యోగాభ్యాసంతో గర్భధారణ సమయంలో కలిగే శారీరక ఇబ్బందులను అధిగమించవచ్చు. అందులోనూ, సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్టవేయవచ్చు. కాకపోతే, నిపుణుల సలహా తర్వాతే ప్రయత్నించాలి.
- ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు మోకాళ్ల మధ్య కాస్త ఎడం ఉండేలా దూరం జరపాలి.
- ఊపిరి వదులుతూ, చేతులను ముందుకు తీసుకొని అరచేతులను నేల మీద ఉంచాలి.
- ఇప్పుడు, గదవను గొంతుకు ఆనేలా కిందికి అనాలి. శ్వాస తీసుకుంటూ మెడను కాస్త ముందుకు తీసుకురావాలి.
- రెండు కండ్ల దృష్టి ముక్కు చివరపై ఉంచాలి. నాలుకను బయటపెట్టి.. శ్వాస వదులుతూ గొంతులో నుంచి సింహనాదం వచ్చేలా గర్జించాలి.
- మళ్లీ గదవను గొంతుకు ఆనించి శ్వాస తీసుకోవాలి. వదిలేటప్పుడు ఇందాకటిలా మెడను కాస్త ముందుకు తెచ్చి నాలుకను బయటపెట్టి, సింహంలా గర్జించాలి. ఇలా ఐదుసార్లు చేయాలి.
- తర్వాత, నిదానంగా మళ్లీ వజ్రాసన స్థితిలోకి రావాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- pregnancy
- Simhasanam
- thyroid
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

