Health Tips | ఈ ఆహారంతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్!
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా పొత్తి కడుపు క్యాన్సర్ల బారి నుంచి బయటపడవచ్చని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఫైబర్‌తో కూడిన ఆహారం ద్వారా బ్రెస్ట్, జననేంద్రియ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతుందని కూడా ఆధారాలు లభించాయి.
న్యూఢిల్లీ : ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా పొత్తి కడుపు క్యాన్సర్ల బారి నుంచి బయటపడవచ్చని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఫైబర్‌తో కూడిన ఆహారం ద్వారా బ్రెస్ట్, జననేంద్రియ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతుందని కూడా ఆధారాలు లభించాయి. తాజాగా ఆయా క్యాన్సర్లకు, అధిక ఫైబర్ ఆహారానికి గల సంబంధాన్ని మరో అధ్యయనం వెల్లడించింది. నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేరీల్యాండ్ (యూఎస్ఏ) ఈ అధ్యయనం చేపట్టాయి.
దేశవ్యాప్త అధ్యయనాలతో అంతర్జాతీయ అధ్యయనాల వివరాలను పరిశోధకులు సరిపోల్చారు. పెద్దపేగు క్యాన్సర్‌తో ఫైబర్‌తో కూడిన ఆహారాల సంబంధంపై 1980 నుంచి 32 అధ్యయనాలు నిగ్గుతేల్చాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం క్యాన్సర్ ముప్పును నివారిస్తుందని వీటిలో చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అయితే అన్ప్రాసెస్డ్ ఫైబర్‌ను తీసుకోవాలని, మొక్కల ఆధారిత ఆహారమైన కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో మొత్తం మనం తీసుకునే క్యాలరీలు తగ్గుతాయని, ఆరోగ్యకరమైన బరువు ఉంటూ క్యాన్సర్ ముప్పును నివారించుకోవచ్చని పోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఓఖ్లాకు చెందిన డాక్టర్ సంజయ్ వర్మ పేర్కొన్నారు. ఫైబర్‌తో కూడిన ఆహారం అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగి జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని వర్మ చెప్పుకొచ్చారు. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, బార్లీ, తృణధాన్యాలు, వేరుశనగ, అవకాడో, ఆరంజ్, యాపిల్, స్ప్రౌట్స్ వంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఫైబర్ అధికంగా తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్‌తో పాటు బరువు, కొవ్వు తగ్గడం, మలబద్ధకం నివారణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. క్యాన్సర్ ముప్పును నివారించడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Food
- health tips
- new study
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

