Health Tips | మూడ్ బాలేదంటే ఈ ఫుడ్‌ను పక్కనపెట్టాల్సిందే!
Health Tips : ఆరోగ్యంలో ఆహారం పాత్ర కీలకమైదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆహారం మన శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహార పదార్ధాలు మానసిక ఉత్తేజానికి ఎలా ఉపకరిస్తాయో మరికొన్ని ఆహార పదార్ధాలు మన మూడ్‌ను భగ్నం చేస్తాయి.

Health Tips : ఆరోగ్యంలో ఆహారం పాత్ర కీలకమైదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆహారం మన శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహార పదార్ధాలు మానసిక ఉత్తేజానికి ఎలా ఉపకరిస్తాయో మరికొన్ని ఆహార పదార్ధాలు మన మూడ్‌ను భగ్నం చేస్తాయి. మనల్ని ఆందోళనకు, కుంగుబాటుకు లోనుచేసే ఆయా ఆహార పదార్ధాలు ఎంత రుచికరంగా ఉన్నా వాటిని పక్కనపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
తీపి పదార్ధాలు నోటికి రుచిగా ఉన్నా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అతిగా తీపిపదార్ధాలు తీసుకుంటే ప్రేవుల ఆరోగ్యం దెబ్బతిని జీర్ణక్రియ సాఫీగా సాగదు. తీపి పదార్ధాలు మానసిక ఉత్తేజాన్ని నిర్వీర్యం చేస్తాయి. మానసిక ఉల్లాసం కోసం గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు
సూచిస్తున్నారు. గ్లూటెన్‌కు మానసిక ఆరోగ్యం దెబ్బతినడం మధ్య సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించడంతో గ్లూటెన్ ఫుడ్‌ను అవాయిడ్ చేయడం మేలు.
ఈ ఫుడ్‌తో కుంగుబాటు ముప్పు
గోధుమలు, సిరిల్స్, పాస్తా వంటి వాటిలో గ్లూటెన్ ఉంటుంది. ఇక పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ను పరిమితంగా తీసుకోవాలి. ఇవి ఏమాత్రం ఆరోగ్యానికి మేలుచేయవని మనకు తెలిసినా వీటిని తింటూ ఉంటాం. ఉప్పు అధికంగా ఉండటంతో పాటు నూనెలో వేయించే ఫ్రెంచ్ ఫ్రైస్ను తింటే ట్రాన్స్ ఫ్యాట్స్ పేరుకుపోవడంతో పాటు కుంగుబాటుకు లోనయ్యే ముప్పు ఉంది. చీజ్, బిస్కెట్లు వంటి ప్రాసెస్డ్ ఆహారంతో కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం విరివిగా తీసుకునే వైట్ రైస్‌ను కూడా పరిమితంగా తినడం మేలని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

