తైక్వాండోలో దూసుకెళ్తున్న తెలంగాణ ఆడబిడ్డ.. ఒలింపిక్స్లో మెడల్ సాధించడమే లక్ష్యం!
Sindhu Tapasvi | సింధు సంధించే కిల్లింగ్ కిక్స్కు రికార్డులెన్నో బద్దలైపోయాయి. ఆ కఠోర సంకల్పానికి రెండు గిన్నిస్ రికార్డులు దాసోహమన్నాయి. ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న యుద్ధ విద్య జీవిత గమ్యమైంది. ఒలింపిక్స్లో అడుగు పెట్టి తెలంగాణ సత్తా చాటాలని ఆశ పడుతున్న తైక్వాండో క్రీడాకారిణి.. సింధు తపస్వి స్ఫూర్తిదాయక ప్రయాణం ఆమె మాటల్లోనే..
తైక్వాండో ఒక సాహసం. అందులోనూ అమ్మాయిలకు పెను సాహసమే! కానీ ఆ దూకుడే నాకిష్టం. అందం కోసం వేలకువేలు ఖర్చు పెట్టేవాళ్లున్నారు. ముఖం బాలేదనో, ముక్కు వంకరగా ఉందనో లక్షలు వెచ్చించి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వాళ్లు ఉన్నారు. కానీ తైక్వాండోలో ఒక్క పంచ్ పడితే, జీవితాంతం ఆ మచ్చ ఉండిపోతుంది. అంత రిస్క్ అవసరమా?.. అని ఎంతోమంది అడిగారు. నా సమాధానం ఒక్కటే. లక్ష్యాన్ని మించిన సౌందర్యం లేదు. లక్ష్య సాధనకు భౌతికమైన పరిమితులు అడ్డంకి కాకూడదు. నేను చెప్పేది కూడా ఒక్కటే. ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దాన్ని సాధించేందుకు చెమటలు చిందించాలి. అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలి. అప్పుడే కలలు నిజం అవుతాయి.

బయటికి వెళ్లాలంటే భయం…
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. అమ్మ టీచర్. తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. చిన్నప్పుడు బయటికెళ్లాలంటేనే భయమేసేది. ఇంట్లో పరిస్థితుల కారణంగా అలా తయారయ్యాను. అమ్మ అర్థం చేసుకుంది. నాలో ఆత్మ న్యూనతను చెరిపేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి కరాటేలో చేర్పించింది. ఆత్మరక్షణకు ఇంతకంటే మార్గం లేదనేది అమ్మ భావన. మొదట్లో భయమేసినా ఆ తర్వాత కరాటేకు దగ్గరయ్యాను. కిరణ్ బేడీ నాకు ఆదర్శం. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి అంటే వీరాభిమానం. ఈరోజు ఇంత ధైర్యంగా ప్రపంచాన్ని చుట్టి వస్తున్నానంటే.. వాళ్లిద్దరే నాకు ప్రేరణ. ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకు అనుకోకుండా.. నా కలలకు అమ్మ రెక్కలు తొడిగింది. అమ్మే లేకపోతే నేనసలు లేనట్టే. అందుకే, అమ్మలందరికీ నా విన్నపం ఒక్కటే.. దయచేసి మీ కూతుళ్లను ప్రోత్సహించండి. వారి బంగారు భవిష్యత్తుకు మీరే అడుగులై ముందుకు నడిపించండి.
సర్కారు సాయం మరువలేనిది..
మాది మధ్యతరగతి కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇక నా ఆశలన్నీ చెరిగిపోయినట్టే అనిపించింది. ఆ సమయంలోనే ఆత్మీయుల సూచనతో హైదరాబాద్ వచ్చాను. కోచ్ జయంత్ రెడ్డిగారి గురించి విన్నాను. ఎటువంటి మద్దతు లేకపోయినా, ఆట కోసం నేను పడు తున్న తాపత్రయం ఆయనకు నచ్చింది. అప్పటి నుంచి అన్నీ తానై ఎన్నో మెళకువలు నేర్పారు. ఇక, అంతర్జాతీయ స్థాయికి వెళ్లడానికి తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. 2016లో యూకే, 2019లో పోలండ్ వెళ్లడానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. ఆ రెండు టోర్నీల్లో పతకాలు సాధించాను. తాజాగా మాంచెస్టర్లో వెండి పతకం, డల్లాస్లో రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం గెలుచుకున్నాను. గిన్నిస్ రికార్డులు కూడా వరించాయి.

ఒలింపిక్స్ పతకమే నా కల…
ప్రతిభతో అవకాశాలను అందుకున్నా.. అంతర్జాతీయ స్థాయిలో నేనేమిటో నిరూపించుకున్నా. కానీ, ఒలింపిక్స్ కలను నిజం చేసుకోవాలంటే డబ్బు కావాలి. తైక్వాండో అంటేనే శరీరాన్ని విల్లులా మారుస్తూ.. మెరుపులా దూసుకుపోవాలి. నిత్యం కఠోరంగా శ్రమించాలి. ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. ఇదంతా డబ్బుతో ముడిపడిన విషయం. డబ్బు లేదనే ఒకే ఒక్క కారణంతో నా కల కలగానే మిగిలిపోతుందేమోనన్న భయం నన్ను వెంటాడుతున్నది. ఉద్యోగం చేయాలని చాలాసార్లు అనుకున్నా. కానీ.. మనసులో ఒలింపిక్స్ లక్ష్యం ఉన్నప్పుడు దేనిపైనా దృష్టి పెట్టలేం! నాకు తెలియకుండానే నేనెప్పుడో తైక్వాండోతో ప్రేమలో పడిపోయా! ప్రస్తుతం.. నా కల, లక్ష్యం, ఆశయం.. అన్నీ ఒలింపిక్స్ బంగారు పతకమే! ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. తప్పక విజయం సాధిస్తా.
…? సూర్యకిరణ్ తోగటి
Read More :
“మోడల్ అంటే అందంగానే ఉండాలా?”
“కార్పొరేట్ జాబ్ వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పెయింటింగ్లు వేయిస్తున్నాడు.. ఎందుకో తెలుసా”
Indina bald woman | గుండు అయితేనేం.. గుండెనిండా విశ్వాసం!”
సపోట నుంచి తేనె దాకా అన్నింటితో వైన్.. మరాఠా అమ్మాయి ఆలోచన అదుర్స్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

