Indina bald woman | గుండు అయితేనేం.. గుండెనిండా విశ్వాసం!
Indina bald woman Shruti Narayanaswamy | ఇటీవల, అకాడమీ అవార్డుల కార్యక్రమంలో యాంకర్ క్రిస్ రాక్‌పై హాలీవుడ్ నటుడు విలార్డ్ స్మిత్ చేయి చేసుకోవడం చర్చనీయం అయింది. స్మిత్ కోపానికి కారణం ఆయన భార్య జడా పింకెట్ స్మిత్‌ను క్రిస్ హేళన చేయడం. జడా స్మిత్ తాను అలోపీసియా వ్యాధితో బాధపడుతున్నట్టు గతంలోనే మీడియాకు చెప్పింది. అందువల్లే తన జుట్టు రాలిపోయిందనీ ప్రకటించింది. ఇదంతా తెలిసి కూడా యాంకర్ ఆమెపై హాస్యం చేయడంతో తనకు కోపం వచ్చిందని స్మిత్ వివరణ ఇచ్చాడు. ఈ సంఘటన అలోపీసియాతో బాధపడుతున్న తమలాంటి ఎంతోమందిని ఇబ్బంది పెట్టిందని డాక్టర్ శ్రుతి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

ప్రస్తుతం శ్రుతి స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో ఫిల్మ్ అండ్ మీడియా రీసెర్చర్. “అలోపీసియా గురించి చాలామందికి తెలియదు. ఈ రుగ్మత ప్రభావంతో బట్టతల వచ్చేస్తుంది. క్రమంగా బోడిగుండులా మారిపోతుంది. కనుబొమలు, రెప్ప వెంట్రుకలు కూడా రాలిపోతాయి. దీంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నా తల్లిదండ్రులూ ఎంతో వేదన అనుభవించారు. పసితనం నుంచి టీనేజ్ వరకు టోపీ పెట్టుకుని తిరిగేదాన్ని. ఎంబీఏలో అడుగుపెట్టగానే ఆత్మవిశ్వాసం పెరిగింది. మొదటి రోజు క్లాస్‌రూమ్‌లోకి గుండుతోనే వెళ్లాను. కానీ ఎవరూ వివక్ష చూపలేదు. అలోపీసియాతో బాధపడుతున్నవాళ్లను ఓదార్చకపోయినా ఫర్వాలేదు. అవమానించకండి చాలు” అనిచెబుతున్నప్పుడు ఆమె గొంతులో ఉద్వేగం.
Read More :
సపోట నుంచి తేనె దాకా అన్నింటితో వైన్.. మరాఠా అమ్మాయి ఆలోచన అదుర్స్”
అప్పుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది.. ఇప్పుడు అవార్డులు అందుకుంటుంది”
“Telu Vijaya | రెండు పీజీలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాటతో వచ్చింది”
“Mumbai Cafe Bambai Nazariya | ముంబైలోని ఈ కెఫేలో సిబ్బంది అంతా ట్రాన్స్‌జెండర్సే!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- baldness
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

