swarnamugi r karthik | ఉద్యోగ, వ్యాపార బాధ్యతల నడుమ గృహిణులకు కూరగాయలు తరిగేందుకు కూడా సమయం దొరకడం లేదు. ఫలితంగా, కుటుంబానికి సరైన పోషక విలువలు అందడం లేదు. ఆ పరిమితిని అధిగమించడానికి కూరగాయలు, పండ్లను ‘ఫ్రోజెన్ ఫుడ్ ( Frozen food )’ రూపంలో మార్కెట్ చేస్తున్నది స్వర్ణముగి ఆర్.కార్తిక్.

ఆమె తండ్రి బి.జి.రఘుపతి తమిళనాడులో వ్యాపారవేత్త. ఆయన అకాల మరణంతో పెద్ద కూతురిగా కంపెనీ బాధ్యతలు తీసుకున్నది స్వర్ణముగి. ఆ సంస్థను విజయవంతంగా నడుపుతూనే.. తన సొంత వ్యాపార ఆలోచన ‘స్వాదికా ఫుడ్స్’ను పట్టాలకు ఎక్కించింది. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి, చక్కగా తరిగి.. నేరుగా వండుకునేందుకు వీలుగా అందించే వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పింది. తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది. ఆయా రుతువులలో లభించే పండ్లు, కూరగాయలను ఫ్రీజర్ ప్యాకేజ్‌తో విదేశాలకు ఎగుమతి చేస్తున్నది స్వర్ణముగి. మామిడి, జామ, అనాస, అరటి, పుచ్చకాయలు, పచ్చి బఠానీ, తరిగిన క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, ఒలిచిన వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహార ఉత్పత్తులను త్వరలోనే భారతీయ వంటిళ్లకూ అందించాలన్నది స్వర్ణముగి ఆలోచన.
కార్పొరేట్ కొలువు వదిలేసి 4 దేశాలు చుట్టొచ్చింది.. బేకరీ స్టార్ట్ చేసింది”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”