ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు, వేసవి వేడి.. మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పొట్టకు చేటు చేస్తున్నాయి. డీహైడ్రేషన్తోపాటు ఆహారపు అలవాట్లు కూడా.. అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వాంతులు, విరేచనాలతోపాటు మరిన్ని వ్యాధులూ చుట్టుముడుతున్నాయి. వీటిని తట్టుకోవాలంటే.. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే!