‘వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్’లో భారతదేశానిది పై నుంచి136వ స్థానం. చివరి నుంచేమో 11వ ర్యాంకు. మనసు ఆనందంగా లేకపోతే శరీరాన్ని అనేక రోగాలు ఆక్రమిస్తాయి. ఈ అనర్థాన్ని అడ్డుకుని, ప్రజలను ఆనంద మార్గంలో నడిపించడానికి ముంబైకి చెందిన శ్రుతి మహేశ్వరి ఒక ఆన్లైన్ గురుకులాన్ని స్థాపించారు. దానిపేరు.. ‘హ్యాపినెస్ గురుకుల్’. శ్వాస, నిద్ర, మనసు.. ఆనందానికి ముఖ్య కారణాలని వివరిస్తారు శ్రుతి. వివిధ వేదికల ద్వారా ఆనందాన్ని వ్యాప్తిచేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారామె.
దాదాపు పదిహేనేండ్లపాటు ఫ్యాషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాలలో పనిచేసిన శ్రుతి మహేశ్వరి పనిలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. ‘ఇష్టమైన పనే చేయండి. చేసే పనినే ఇష్టపడండి’ అనేది ఒకప్పటి ఆమె సందేశం. కానీ నచ్చిన పని మాత్రమే జీవితానికి ప్రయోజనం చేకూర్చదని ఓ దశలో అనిపించింది. దీంతో మనసు, శరీరం.. రెండిటి మధ్య సంబంధంపై రెండేండ్లకుపైగా పరిశోధనలు చేశారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి శరీరం ఫిట్‌గా ఉంటే సరిపోతుందని అనుకుంటాం. అయితే, 95 శాతం రోగాలకు మనసే కారణమని శ్రుతి అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత శ్రుతి పూర్తి స్థాయి ఆనంద శిక్షకురాలు (హ్యాపినెస్ కోచ్)గా అవతరించారు. ఆనంద అన్వేషణలో ఉన్నవారికి పెద్దబాల శిక్షలా ఉపయోగపడేలా ‘ద హ్యాపినెస్ ట్రైపాడ్’ అనే పుస్తకాన్ని రాశారామె. త్వరలోనే అది అందుబాటులోకి రానుంది.
“వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి.. ముఖేశ్ అంబానీ గారాలపట్టి చెప్పిన విజయసూత్రాలివే..”
అన్నదాతలకు అండగా నిలబడిన హైదరాబాదీ ఆడబిడ్డ.. ఆమె ఏం చేస్తుందంటే..”
“Kanna Ooru | ఒక్క జిల్లా నుంచి ఎస్సై జాబులు కొట్టారు.. కన్న ఊరు రుణం తీర్చుకుంటున్నారు”
Sangeetha Kala Sisters | ఆ సిస్టర్స్‌కి రామకథలే అన్నపానీయాలు”