వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి.. ముఖేశ్ అంబానీ గారాలపట్టి చెప్పిన విజయసూత్రాలివే..
Isha Ambani | తాత దార్శనికుడు. తండ్రి విశ్వకుబేరుడు. కానీ, ఆమె ఆ వారసత్వాన్ని పక్కనపెట్టి, తనదైన మార్గం నిర్మించుకుంటున్నది. ఆంత్రప్రెన్యూర్‌గా విజయం సాధించాలంటే.. తమవైన లక్ష్యాలు ఉండాలి. తమకంటూ కొన్ని విజయ సూత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఈశా అంబానీకి ఆ స్పష్టత ఉంది. ఆమె మాటలే అందుకు సాక్ష్యాలు..
♦ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆంత్రప్రెన్యూర్లు సిద్ధంగా ఉండాలి. ఎక్కడ చదువుకున్నాం? ఎన్ని మెడల్స్ సాధించాం? అన్నది పక్కనబెట్టి నిత్యం కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే వ్యాపారంలో వృద్ధి సాధించగలం.
♦ క్రమశిక్షణ, చేసే పని మీద ప్రేమ ఎంతో ముఖ్యం. అలాగే ఆత్మవిశ్వాసం కూడా. ఇతరుల ప్రభావం మన పనిపై పడకూడదు. మన కలలను నమ్ముకుని మనం ముందుకు వెళ్తున్నప్పుడు.. ఇంకెవరి అనుమతో అక్కర్లేదు. ఎవరెన్ని చెప్పినా, ఉన్నది ఒకటే జిందగీ. జీవితాన్ని మనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవాలి.

♦ ఆంత్రప్రెన్యూర్లు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఓటమి భయం ఏమాత్రం ఉండకూడదు. నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ముందుకెళ్లడమే మేలు. తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలబడాలి. వీలైనంతమంది మహిళలకు అవకాశాలు కల్పించాలి.
♦ ఇంట్లో పెద్దలు మనకు జీవిత పాఠాలు చెబుతుంటారు. వాటిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి. నేను మా నాన్నను, సహోద్యోగులను బాగా గమనిస్తాను. కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. అవన్నీ ఏ బిజినెస్ స్కూల్లోనూ బోధించరు.
Read More :
Engineers Biryani | జాబు వదిలేసి బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు”
“Kanna Ooru | ఒక్క జిల్లా నుంచి ఎస్సై జాబులు కొట్టారు.. కన్న ఊరు రుణం తీర్చుకుంటున్నారు”
“తైక్వాండోలో దూసుకెళ్తున్న తెలంగాణ ఆడబిడ్డ.. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే లక్ష్యం!”
“కార్పొరేట్ జాబ్ వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పెయింటింగ్‌లు వేయిస్తున్నాడు.. ఎందుకో తెలుసా”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Mukesh Ambani
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

