Shruti Haasan | పక్కింటి అమ్మాయిలా కనిపించే నటి శృతిహాసన్. వివిధ సందర్భాల్లో.. తన వ్యక్తిత్వాన్ని గురించీ, జీవితంలో ఎదుర్కొన్న రకరకాల ఇబ్బందుల గురించీ ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె చెప్పింది నిజమేననీ, తమకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయనీ అభిమానులు స్పందిస్త్తూ ఉంటారు. ఈ మధ్య ఓ చాట్లో.. తాను ఒకప్పుడు ఎదుటి వారికి నచ్చేలా ఉండాలని చాలా ప్రయత్నించానని చెప్పుకొచ్చింది శృతి. దానివల్ల మంచి స్నేహితులను కోల్పోయానంటున్నది. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ తనలా తను ఉండటం అలవాటు చేసుకున్నాననీ, దాని వల్ల మనమేమిటో మనకు తెలుస్తుందనీ, అసలైన సంతోషం అదేననీ వెల్లడించింది.
‘నేనుఅందరితో ఒకేలా ఉంటా. నేను నాలాగే ఉంటా. కొంతమంది నన్ను ప్రేమిస్తారు. అయితే, కొందరికి నా ఆలోచనలు, ప్రవర్తన విచిత్రంగా అనిపించొచ్చు. అయినా ఫర్వాలేదు. నాకు ఇలా ఉండటమే ఇష్టం. మనిషి ఇలాగే ఉండాలని ఎవరూ నిర్వచించలేరు. కాబట్టి మనం ఎదుటి వారికి నచ్చేలా మాత్రమే బతకాలని ఎప్పుడూ అనుకోవద్దు’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నది శృతి.
“ప్రియుడితో కలిసి బిహు వేడుకలకు శ్రుతి హాసన్”
Shruti Haasan | నాపై వచ్చే వార్తలను చదవను: శృతిహాసన్”
“Shruti Hassan: శృతి హాసన్ ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. ఏ నెంబర్ ఇచ్చిందో తెలుసా?”