కమల్ గారాల పట్టి శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు నెటిజన్స్‌తో ముచ్చటించే ఈ ముద్దుగుమ్మ తాజాగా చాట్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్స్..శృతికి ప్రశ్నలు సంధించగా, వాటికి ఆశ్చర్యకరమైన సమాధానాలు ఇచ్చింది.
ఓ నెటిజన్ శృతి హాసన్ ని తన నెంబర్ అడగగా దానికి శృతి అదిరే రిప్లై ఇచ్చేసింది. నెటిజన్ అడిగిన ప్రశ్నకు జవాబుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ‘100’ అని రిప్లై ఇచ్చింది. దీనితో ఈ రిప్లై చూసి అంతా నవ్వుతున్నారు.శృతి సెన్స్ ఆఫ్ హ్యూమర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. శృతి ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో చక్కర్లు కొడుతుంది.
అక్టోబర్ 2 న బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడ ఆమె దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన ఇంటి సరకుల కోసం షాపింగ్ చేయడం సంతోషంగా ఉందంటూ శృతి రాసుకొచ్చారు. శృతి హాసన్, సంతను హజారిక గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక శృతి చివరిసారిగా లాభం చిత్రంలో నటించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాలో శృతి నటిస్తోంది. ఏప్రిల్ 14, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.