Samsung AirDresser | చలికాలం మొదలైపోగానే బీరువాలోని ఉన్ని దుస్తులన్నీ బయటికి వస్తాయి. షెల్ఫుల్లో ఉన్న కుల్లాలు, మఫ్లర్లు, గ్లౌజులను శుభ్రంగా ఉతుక్కుంటారు. అయితే, సహజంగానే దళసరిగా ఉండే శీతకాలపు దుస్తులను ఉతకడం అంత సులువైన పనేం కాదు. అలాగని డ్రై క్లీనింగ్‌కు ఇస్తే ఓ పట్టాన తిరిగిరావు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ మార్కెట్లోకి వచ్చింది.. సామ్సంగ్ వార్డ్రోబ్ షేప్డ్ ఎయిర్ డ్రెస్సర్.
ఇది వార్డ్రోబ్లాగే ఉన్నా, వాషింగ్ మెషీన్ పాత్ర కూడా పోషిస్తుంది. ఉతక్కుండానే బట్టలపై ఉన్న దుమ్మూధూళి, దుర్వాసన దూరం చేస్తుంది. గాలి, ఆవిరి సాయంతో పనిచేస్తూ.. నిమిషాల్లో ఉన్ని దుస్తులను మెరిపిస్తుంది. ఇందులోని జెట్స్టీమ్ వస్త్రంలోకి వేడిని పంపుతుంది. జెట్ ఎయిర్, ఎయిర్ హ్యాంగర్స్ బట్టల్లోని దుమ్మును గాలితో పాటుగా బయటికి విడుదల చేస్తాయి. హీట్‌పంప్ డ్రైయింగ్ ద్వారా బట్టలు ఇట్టే ఆరిపోతాయి. చివరగా చెమట, పొగాకు తాలూకు దుర్వాసనలను డియోడరైజింగ్ ఫిల్టర్ పోగొడుతుంది. కృత్రిమ మేధ సాయంతో ఈ ఎయిర్ డ్రెస్సర్ వస్త్ర స్వభావాన్ని బట్టి పనితీరును మార్చుకుంటుంది. ధర లక్ష రూపాయల పైచిలుకు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
టాయిలెట్లలో డబుల్ ఫ్లష్ ఎందుకో తెలుసా?
ఉల్లితో ఇలా చేయొచ్చని తెలుసా!!
బంగారు ఆభరణాలేనా? ఈ బొగ్గు నగల వైపు కూడా ఒక లుక్కేయండి