ఒకప్పుడు కేవలం కాల్స్ చేయడానికి, మెసేజ్లు పంపడం కోసమే ఫోన్ వాడేవాళ్లం. ఇప్పుడు.. అదే ఫోన్ కంటెంట్ సృష్టిస్తున్నది. మన పనులన్నీ చకచకా చేసేస్తున్నది. మన రోజువారీ జీవితాన్ని ప్రపంచంతో ముడివేస్తున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ రాకతో ఈ బంధం మరింత బలపడింది. ఈ క్రమంలో సామ్సంగ్ తీసుకొస్తున్న గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ‘ఫోన్ అంటే ఇది’ అనిపించేలా చేస్తున్నది. సరికొత్త ఏఐ ఇముడ్చుకున్న ఈ స్మార్ట్ఫోన్.. వ్యక్తిగత సహాయకుడిగా మారిపోతున్నది. ఇక డిజైనింగ్ విషయానికి వస్తే స్లిమ్లుక్తో ైస్టెలిష్గా కనువిందు చేస్తున్నది.
ఈ ఫోన్ మందం కేవలం 5.85 మిల్లీమీటర్లు మాత్రమే. ఇందులో చెప్పుకోదగిన మరో అప్డేట్.. 200 మెగాపిక్సెల్ కెమెరా! గెలాక్సీ ఏఐ సాయంతో ఈ కెమెరా ప్రతి దృశ్యాన్ని అద్భుతంగా మార్చేయగలదు. మీరు తీసిన ఫొటోలను చక్కని స్టోరీలా మార్చేస్తుంది కూడా! ఏదైనా పెళ్లికి వెళ్లినప్పుడు ఓ పది ఫొటోలు తీశారే అనుకోండి.. వాటన్నిటినీ కలిపి చక్కని స్టోరీ రీల్ చేసేస్తుంది.
ఈ కెమెరాతో 8K వీడియోలు తీయొచ్చు. ఇక ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. స్లిమ్ ఫోన్ బరువు 163 గ్రాములు. ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్తో ముస్తాబయ్యింది. స్క్రీన్ పొడవు 6.7 అంగుళాలు. అమెలెడ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొటెక్షన్తో దృఢంగా తయారైంది. స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్, 12 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజీతో ఇతర స్పెసిఫికేషన్లు! 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫొటోగ్రఫీ లవర్స్, టెకీలకు ఇది చక్కని ఎంపిక. దీని అంచనా ధర: రూ.79,999.