ఎండల్లో బయటికి వెళ్తున్నారా జర భద్రం. భగభగ మండుతున్న భానుడు వడదెబ్బ రుచి చూపిస్తున్నాడు. ఇప్పటికే వడదెబ్బ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద మందికిపైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమరుపాటుగా ఉండకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. రోహిణి కార్తె రాకతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత వల్ల రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నది. వడదెబ్బ కారణంగా పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? వాటి నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి? వేసవిలో పిల్లల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, వడదెబ్బకు గురైనప్పుడు వారికి అందించాల్సిన చికిత్స తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
పిల్లలకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో వాళ్లు బయట ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కువ సమయం ఎండలో గడపడం పిల్లలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉంటుంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరిగి అతినీలలోహిత కిరణాలు వెలువడుతుంటాయి. దీంతో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎండలో ఆడటం, తిరగడం, తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని పగటి పూట బయటికి వెళ్లడం ఇవి శ్రేయస్కరం కాదు. ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్ (వడదెబ్బ), హెపటైటిస్ తదితర సమస్యల బారిన పడే
అవకాశాలు ఉన్నాయి.
పిల్లల్లో ‘హీట్ రెగ్యులేషన్ సిస్టమ్’ అనేది తక్కువ స్థాయిలో పనిచేస్తుంటుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా వారిలో తక్కువగా ఉంటుంది. దీంతో పెద్దలతో పోలిస్తే పిల్లలు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. సన్‌స్ట్రోక్‌కు గురైనప్పుడు వెంటనే పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడతారు. అంటే శరీరంలోని నీరు ఆవిరైపోతుందన్నమాట. ఎక్కువగా ఎండలో తిరగడం, వడగాలులకు గురవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా వేసవిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. పిల్లలు ఎండలో తిరగడం వల్ల శరీరంలోని లవణాలు, నీరు వాతావరణంలోని ఉష్ణోగత్రకు ఆవిరైపోతాయి. దీంతో పిల్లలు నీరసించిపోతారు. అందువల్ల పిల్లలను సాధ్యమైనంత వరకు ఎండల్లో బయటికి పంపకపోవడమే మంచిది.
డీహైడ్రేషన్ లక్షణాలు
మండే ఎండలతో అనర్థాలు
పిల్లల విషయంలో..
ఐదేండ్ల లోపు చిన్నారులు చాలా సున్నితంగా ఉంటారు. తీవ్రమైన సూర్యరశ్మిని వారు తట్టుకోలేరు. అధిక ఎండలో పిల్లలను బయటికి తీసుకెళ్తే వాళ్లు డయేరియా బారినపడే ప్రమాదం ఉంది. దీంతో వాంతులు, విరేచనాలు ఏర్పడి వెంటనే డీ-హైడ్రేషన్‌కు గురవుతారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. పిల్లలను ఎండలో బయటికి తీసుకెళ్లకండి. ఒకవేళ తీసుకెళ్లాల్సి వచ్చినా.. వారికి ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు కాటన్ దుస్తులు వేయాలి. వేసవిలో ఇంటి నుంచి బయటికి వెళ్లకపోయినా పిల్లలు ఎండవేడిమి, వడగాలుల వల్ల డయేరియా, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని పిల్లలను ఉంచే గదులు చల్లగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
వడదెబ్బ తగిలినప్పుడు..
ప్రాథమిక చికిత్స
పై లక్షణాలు కనిపించి పిల్లలను వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలి. అంతకు ముందు డీహైడ్రేషన్‌కు గురైన పిల్లలకు ఓఆర్ఎస్ ద్రవాన్ని కొద్ది కొద్దిగా తాగించాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేకపోతే ఇంట్లో కాచి, చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, చిటికెడు చెక్కరను కలిపి ఆ ద్రవాన్ని తాగించాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీళ్లు తాగించడం ఉత్తమం. వాంతులు, విరేచనాలు నియంత్రణ కాకపోతే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి. ఆలోపు వారికి ఓఆర్ఎస్ ద్రవాన్ని తాగించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇన్ఫెక్షన్లు నీటి ద్వారా ఇతర పిల్లలకు సోకే అవకాశాలుంటాయి.
నీరు తాగించాలి.
పిల్లలకు వదులైన కాటన్ దుస్తులు,తేలికపాటి రంగున్నవి వేయాలి.
వేసవిలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దు. ఎండ తీవ్రత చిన్నపిల్లలు,గర్భిణులపై అధికంగా ఉంటుంది.
వీరు త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని తరచూ నీళ్లు లేదా ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. కూల్‌డ్రింక్స్ వంటివి కాకుండా ప్రకృతి సహజ సిద్ధమైన కొబ్బరినీళ్లు, చెరకు రసం, చల్ల, పళ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం. వాంతులు, విరేచనాలు వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం పనికిరాదు…?మహేశ్వర్‌రావు బండారి
-డాక్టర్ రమేష్‌బాబు దాంపురి
నిలోఫర్ రిటైర్డ్ ఆర్ఎంఓ,ఐఏపి నగర అధ్యక్షులు