తగ్గేదేలే.. ఈ ఒక్క డైలాగ్‌కి మార్కెట్లో కోట్లు కురిపిస్తోంది
Thaggede le | ఒక్క డైలాగ్.. సినిమా రేంజ్‌ను మార్చేస్తుంది. చిన్న పంచ్‌లైన్.. మార్కెట్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఆ డైలాగ్ చెప్పిన హీరో.. ఈ పంచ్‌లైన్ విసిరితే.. మార్కెట్లో ఆ బ్రాండ్ బ్యాండ్ బజాయిస్తుంది. ఆ డైలాగే ‘తగ్గేదే లే’!
Thaggede le | ఒక్క డైలాగ్.. సినిమా రేంజ్‌ను మార్చేస్తుంది. చిన్న పంచ్‌లైన్.. మార్కెట్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఆ డైలాగ్ చెప్పిన హీరో.. ఈ పంచ్‌లైన్ విసిరితే.. మార్కెట్లో ఆ బ్రాండ్ బ్యాండ్ బజాయిస్తుంది. ఆ డైలాగే ‘తగ్గేదే లే’! ఆ మాటన్న కథానాయకుడు అల్లు అర్జున్. ‘పుష్ప’ తర్వాత ఈ హీరో వెండితెరపైనే కాదు.. ప్రకటనల ప్రపంచంలోనూ ఐకాన్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎక్కడైనా, ఎప్పుడైనా ‘ఆగేదే లే..’ అంటున్నాడు.
సినీతారలు ప్రకటనల్లో తళుక్కుమనడం ఎప్పట్నుంచో ఉన్నదే! మార్కెట్లో ఉన్న అభిమాన గణాన్ని బట్టి, వారి ఖాతాలో తాజా విజయాల ఆధారంగా వాణిజ్య సంస్థలు ముందుకొస్తాయి. నిమిషం నిడివి కూడా లేని యాడ్స్ కోసం కోట్లలో పారితోషికం చదివించడానికి సిద్ధపడతాయి. ఫామ్‌లో ఉన్న క్రికెట్ ఆటగాళ్లకు ఈ డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. కానీ, సినీతారల దగ్గరికి వచ్చేసరికి హిట్లు ప్రధాన కొలమానం అవుతాయి. 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం లోకల్ మార్కెట్‌ను దాటి పాన్ ఇండియా స్థాయిలో హిట్ సాధించింది. అల్లు అర్జున్ స్థాయిని ఆల్ ఇండియా రేంజ్‌కు పెంచింది. దీంతో, వాణిజ్య సంస్థలు ఐకాన్‌స్టార్ కాల్షీట్ల కోసం పడిగాపులు కాస్తున్నాయి. ఎర్రతివాచీ పరిచి మరీ బన్నీకి ఆహ్వానం పలుకుతున్నాయి.

వైరల్ వైబ్స్
‘పుష్ప’ హిట్‌తో అల్లు అర్జున్ మార్కెట్ అమాంతం పెరిగింది. సినిమా పాన్ ఇండియా హిట్ సాధిస్తే, అందులోని డైలాగ్‌లకు విదేశాల్లోనూ వీరాభిమానులు తయారయ్యారు. గల్లీ కుర్రాడి నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ దాకా అందరూ ‘తగ్గేదే లే’ అంటూ పుష్ప మానియాలో విహరించారు. హిందీలో ‘ఝుకేగా నహీ’ అన్నా, తమిళంలో ఇంకేదో అన్నా.. యాడ్స్ ప్రపంచం అంతా అల్లు చుట్టూరా అల్లుకుంది. సామాజిక మాధ్యమాల్లోనూ బన్నీ డైలాగులు వైరల్ అవడంతో.. ఆ వైబ్స్‌ను క్యాష్ చేసుకోవాలని దిగ్గజ వాణిజ్య సంస్థలు ఫిక్సయ్యాయి. పుష్ప విడుదలై ఏడాది కావొస్తున్నా ఆ సినిమా మానియా ఇంకా కొనసాగుతూనే ఉన్నది.

పంచ్ మాటలతో..
‘మేం ఆగం.. అసలు ఆగం’ ఇటీవల విడుదలైన ‘కోకా కోలా’ యాడ్ పంచ్‌లైన్ ఇది. అల్లు అర్జున్ స్టెప్పులు, అర్మాన్ మాలిక్ గాత్రం కోక్ యాడ్‌కు కొత్త కిక్ ఇచ్చాయి. ప్రకటన సారాంశం అటుంచితే, అందులో వాడిన పదాలు మాత్రం పుష్ప డైలాగ్‌కు దగ్గరగా ఉండటం విశేషం. కోక్ యాడ్ మాత్రమే కాదు.. జొమాటో ప్రకటనలోనూ బన్నీ జోష్ ఫుల్లుగా కనిపిస్తుంది. ‘మనసు కోరితే.. తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ డైలాగే ప్రతిధ్వనించింది. జొమాటో తాజా యాడ్లోనూ పుష్ప ఫ్లేవర్ కనిపిస్తుంది. కేఎఫ్‌సీ ప్రకటనకొస్తే ‘కారం కరెక్ట్‌గా ఉండాది’ అని పుష్ప యాసనే ఉపయోగించుకున్నారు. ఇవేకాక ఆస్ట్రల్, సెవన్ అప్, ఆహా, శ్రీచైతన్య విద్యా సంస్థలు, రెడ్ బస్, ర్యాపిడో సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు అల్లు అర్జున్. ఇవన్నీ దాదాపుగా పుష్ప విడుదల తర్వాత ఒప్పందం చేసుకున్నవే. ఈ ప్రకటనల ప్రభావంతో ఆయా బ్రాండ్ల విక్రయాల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రోజుకు కోట్లలో?
పాన్ ఇండియా స్టార్‌గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రకటనల పారితోషికమూ కోట్ల పైమాటే! యాడ్ షూటింగ్స్ కోసం రోజుకు రూ.7.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ ప్రకటనల్లో నటించినందుకు గానూ రోజుకు రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక అక్షయ్‌కుమార్ రోజువారీగా కాకుండా ఒక్కో ప్రకటనకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు వసూలు చేస్తున్నాడట. ఈ లెక్కల్లోనూ టాప్ రేంజ్లో దూసుకుపోతున్నాడు బన్నీ. అయితే, ఈ గణాంకాలు ఎంతవరకు నిజమో వాళ్లకే తెలియాలి. మొత్తానికి ‘పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్’ అని నిరూపిస్తున్నాడు పాన్ ఇండియా ఐకాన్ స్టార్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేమో.. బ్రాండ్ అంబాసిడర్‌గా ఆగేదే లేదని దూసుకుపోతున్నాడు.
Read More :
“Pushpa 2 | ఈ లొకేషన్లోనే ‘పుష్ప 2’ షూటింగ్ షురూ.. !”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

