పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ సంపాదించాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఈ హీరో రీసెంట్గా న్యూయార్క్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ 40th Annual India Day Parade పాల్గొన్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. హాలీవుడ్ సినిమా (Hollywood film)లో నటించాలని బన్నీకి ఆఫర్ వచ్చిందట.
న్యూయార్క్ సందర్శన (New York visit)లో ఉన్నపుడు అల్లు అర్జున్‌తో ఓ హాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సూపర్‌హీరో ప్రాంఛైజీ కోసం సంప్రదింపులు జరిపినట్టు జోరుగా టాక్ నడుస్తోంది. పుష్ప బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టిన తర్వాత బాలీవుడ్‌తోపాటు ఇప్పటికే చాలా బ్రాండ్ల ఆఫర్లు బన్నీ తలుపు తట్టాయని వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
బన్నీ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది నిజమే అయితే అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. అల్లు అర్జున్ సీక్వెల్ ప్రాజెక్టు పుష్ప..ది రూల్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. త్వరలో బన్నీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.