పెసర బెల్లం కుడుములు
పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుకర్‌లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి పప్పుగుత్తితో మెత్తగా మెదిపి
కావలసిన పదార్థాలు
పెసర్లు: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక కప్పు, బెల్లం: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: చిటికెడు.
తయారీ విధానం
పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుకర్‌లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి పప్పుగుత్తితో మెత్తగా మెదిపి దగ్గరపడ్డాక దించి చల్లార్చాలి. ఒక గిన్నెలో బియ్యపు పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి జారుగా కలిపి స్టవ్‌మీద పెట్టి ముద్ద అయ్యేవరకూ కలుపుతూ ఉడికించాలి. పిండి మిశ్రమాన్ని ముద్దలా బాగా కలిపి కొద్దికొద్దిగా తీసుకుని చిన్నపాటి పూరీల్లా ఒత్తి, మధ్యలో పెసర మిశ్రమం పెట్టి కజ్జికాయల్లా మడవాలి. వాటిని ఆవిరిపాత్రలో పావుగంటపాటు ఉడికించుకుంటే వేడివేడి పెసర బెల్లం కుడుములు సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

