శివుడికి శ్రీ గద్దె చందమామ
మాకు సారె గద్దె చందమామ
రెండేసి పూలేసి చందమామ
రెండు జాములాయే చందమామ
శివపూజ యాలాయే చందమామ
శివుడు రాకపాయే చందమామ
మూడేసి పూలేసి చందమామ
శివుడింకా రాడాయే చందమామ
శివుని పూజ యాలాయే చందమామ
గోరంట చెట్లల చందమామ
గోడపెట్ట పాయే చందమామ
నాల్గేసి పూలేసి చందమామ
నాల్గు జాములాయే చందమామ
శివ పూజ యాలాయే చందమామ
శివుడు రాకపాయే చందమామ
రుద్రాక్ష వనములో చందమామ
నిద్రించవాయే చందమామ
ఐదేసి పూలేసి చందమామ
ఐదు జాములాయే చందమామ
శివుడింకా రాడాయే చందమామ
శివుని పూజ యాలాయే చందమామ
బంతి వనములోన చందమామ
బంతులాడవాయే చందమామ
ఆరేసి పూలేసి చందమామ
ఆరు జాములాయే చందమామ
శివ పూజ యాలాయే చందమామ
శివుడింకా రాడాయే చందమామ
మల్లె వనములోన చందమామ
మాటలాడవాయే చందమామ
ఏడేసి పూలేసి చందమామ
ఏడు జాములాయే చందమామ
రత్నాల గౌరు చందమామ
నీరాసి కలుపుళ్లు చందమామ
ఎనిమిదో పువ్వేసి చందమామ
ఎనిమిది జాములాయే చందమామ
తీగె తీగల బిందె చందమామ
రాగి తీగల బిందె చందమామ
తొమ్మిదో పువ్వేసి చందమామ
తొమ్మిది జాములాయే చందమామ
రాశువాడలేసి చందమామ
రాశిగలపరారే చందమామ
పదేసి పూలేసి చందమామ
పది జాములాయే చందమామ
తీగె తీగల బిందె చందమామ
రాగి తీగల బిందె చందమామ
శివపూజ యాలాయే చందమామ
శివుడు రాకపాయే చందమామ
శివుడికి శ్రీ గద్దె చందమామ
మాకు సారె గద్దె చందమామ
శివుడికి శ్రీ గద్దె చందమామ
మాకు సారె గద్దె చందమామ