కావలసిన పదార్థాలు:
ఓట్స్: పావు కప్పు, దాల్చిన చెక్క: చిన్నముక్క, సబ్జా గింజలు: అర టేబుల్ స్పూన్, అరటిపండు: ఒకటి, సోయాపాలు: అర కప్పు, చాక్లెట్ సిరప్: అర కప్పు, పెరుగు: అర కప్పు, ఐస్ క్యూబ్స్: ఐదు
తయారీ విధానం:
ముందుగా మిక్సీజార్‌లో ఓట్స్, దాల్చిన చెక్క, సబ్జా గింజలు, అరటిపండు ముక్కలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత సోయాపాలు, చాక్లెట్ సిరప్, పెరుగు వేసి మరోసారి బ్లెండ్ చేస్తే చాలు. నోరూరించే బనానా స్మూతీ రెడీ. ఐస్‌క్యూబ్స్ వేసుకొని చల్లచల్లగా తాగేయొచ్చు.