నోటి అల్సర్ల నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వల్ల అల్సర్ల సమస్య ఏర్పడుతుంది. కాబట్టి.. తేనె పూయడం వల్ల కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడతాయి. ఒక టీ స్పూన్ తేనెలో చిటికెడు పసుపు కలిపి వీటిపై రాసినప్పుడు కొంత ఉపశమనం లభిస్తుంది.
నోటిపూతకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. రోజుకు నాలుగైదుసార్లు తులసి ఆకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గుతుంది.