nails health tips | చర్మానికి ఇచ్చే ప్రాధాన్యం గోళ్లకు మాత్రం ఇవ్వరు చాలామంది. ముఖ్యంగా చలికాలంలో గోళ్లను సరిగ్గా పట్టించుకోకపోతే పగుళ్లు వస్తాయి, పొడిబారడం, మొండిగా మారడం సర్వసాధారణం. కాబట్టి చేతులు శుభ్రం చేసుకున్న ప్రతిసారీ హ్యాండ్ క్రీమ్ లేదా లోషన్ రాసుకోవాలి. దీంతోపాటు ైగ్లెసిన్, టైరోసిన్, లిపిడ్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండే మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలి. అవి చేతులతో పాటు గోళ్లనూ హైడ్రేట్ చేస్తాయి. అలాగే రాత్రిళ్లు కొబ్బరి లేదా బాదం నూనెతో చేతి వేళ్లు, గోళ్లకు మర్దన చేయాలి.
ఇంటి పనులు చేసేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకుంటే గోళ్లు పాడవకుండా ఉంటాయి. వేడినీళ్లతో స్నానం చేసే ముందు గోళ్లకు కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ పూయాలి. గోళ్లు మరీ పొడవుగా పెరగకుండా తరచూ కత్తిరించాలి. గోళ్లు కత్తిరించాక చివర్లను నునుపుగా చేయాలి. వీటన్నిటితో పాటు రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. నిత్యం ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్స్‌తో నిండిన ఆహారం తీసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ముఖంపై మడతలు వస్తున్నాయా? అయితే ఈ పండు తినండి
Weight Loss | చలికాలంలో బరువు పెరిగిపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి
Winter Food | చలికాలంలో ఈ ఫుడ్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా
Milk | ఏ పాలు తాగితే మంచిది? ఆవుపాలా? బర్రెపాలా?
Health tips : ఈ పప్పులతో అనారోగ్య ముప్పునకు చెక్!
Health tips | మీ వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో వచ్చే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
allam murabba | ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఏమవుతుంది?