ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దానికి కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికెలో వృథా చేసే అయిదు నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలుచేస్తుంది. ప్రతి రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసుకు, శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.