e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిందగీ అమ్మ.. అనిత.. విజయమ్మ!

అమ్మ.. అనిత.. విజయమ్మ!

వెండితెరపై చక్కనమ్మ లావణ్య త్రిపాఠి. అందమైన రూపం, అంతకుమించిన నటన ఆమెను తెలుగువారికి దగ్గర చేశాయి. కుటుంబం తనకిచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇండస్ట్రీలోకి వచ్చానంటున్నది లావణ్య. ముఖ్యంగా తన తల్లి ప్రోత్సాహం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇటీవల తల్లితో తనకున్న అనుబంధాన్ని, ఆ అమ్మ తర్వాత అంతలా తనను ఆదరించిన అమ్మల గురించీ వివరించింది.ఆ సంగతులేవో ఆమె మాటల్లోనే..

అమ్మ.. అనిత.. విజయమ్మ!

అప్పుడు నాకు పదిహేడేండ్లు! చల్లటి డెహ్రాడూన్‌, వెచ్చని అమ్మ ఒడి.. ఆ రోజులే వేరు. చిన్నప్పటి నుంచీ అమ్మను వదిలి ఉన్నది లేదు. పైచదువుల కోసం ముంబయికి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్లకు, సినిమా అవకాశాలతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేశా. అమ్మ నాకిచ్చిన స్వేచ్ఛ, తనకు నాపై ఉన్న నమ్మకమే నన్ను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. బయట ఎంత ఇండిపెండెంట్‌గా ఉన్నా, ఇంటికి వెళ్లగానే అమ్మ కూచీనైపోతా! ఎంత దూరంలో ఉన్నా తరచూ అమ్మను కలుస్తూనే ఉంటాను. అమ్మను మిస్సయ్యే ప్రసక్తే ఉండేది కాదు. కానీ, గతేడాది లాక్‌డౌన్‌తో అమ్మను చాలారోజులు కలుసుకోలేకపోయా. తను డెహ్రాడూన్‌లో, నేను హైదరాబాద్‌లో! ఎంత ఏడుపొచ్చేదో!!

నెలల తరబడి అమ్మకు దూరంగా ఎన్నడూ ఉండలేదు. జీవితంలో మొదటిసారి ఒంటరినన్న ఫీలింగ్‌ కలిగింది. కానీ, ఆ బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది నా స్నేహితురాలు అనితారెడ్డి. మా అమ్మ ఆప్యాయత తన కండ్లలో చూశా. తన స్పర్శలో తెలుసుకున్నా. పాండమిక్‌ రోజుల్లో తనే నాకు అమ్మయింది. ఓ చిన్న ప్రమాదంలో నా రెండు వేళ్లు విరిగాయి. అప్పుడు అనిత నన్నెంత బాగా చూసుకుందో! ఒక్కమాటలో చెప్పాలంటే.. అమ్మలా ఆదరించింది. నా పనులన్నీ చేసేది, రకరకాల వంటలు చేసి తినిపించేది. తను చేసిన కిచిడి రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే!
అమ్మను మరిపించింది.

మా ఇంట్లో నా సహాయకురాలు విజయమ్మ గురించి చెప్పుకోవాలి. రోజురోజుకూ మా అనుబంధం పెరిగిపోతున్నది. తనో పనిమనిషి, నేనో యజమానురాలిని అన్న ఫీలింగ్స్‌ ఎప్పుడో చెరిగిపోయాయి మా మధ్య. ఇద్దరం ఒకరి గురించి మరొకరం తెగ పట్టించేసుకుంటాం. తనకు ఒంట్లో నలతగా ఉంటే నేను ఫార్మసీకి పరిగెత్తి మందులు తెచ్చేస్తా. తనైతే నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటుందో మాటల్లో చెప్పలేను. షూటింగ్‌ నుంచి బాగా లేట్‌గా వస్తానా, వంటింటి నుంచి ఘుమఘుమలాడే సాంబారు వాసనతో ఆ అలసట ఇట్టే మాయం అయిపోతుంది. మా విజయమ్మ సాంబారా మజాకా! ఆ రుచి ముందు అన్నీ బలాదూర్‌!! నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది.

ఎందరు ఎంతగా ఆదరించినా ప్రతి బిడ్డకు తల్లి దగ్గర దొరికే ప్రేమను మించింది ఉండదు. నా జీవితం అంతా మా అమ్మ కిరణే. తను చెంతనుంటే వేరే ప్రపంచంతో పనెందుకూ అనిపిస్తుంది. అమ్మ ఒడిని మించిన అందమైన చోటు వేరే ఏముంటుంది? ఏదేమైనా అనిత లాంటి స్నేహితురాలు, విజయమ్మ లాంటి సహాయకురాలు దొరకడం నిజంగా నా అదృష్టమే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మ.. అనిత.. విజయమ్మ!

ట్రెండింగ్‌

Advertisement