Microsoft India COO Irina Ghose | ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ ఇండియా కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమితురాలైన ఇరినా ఘోస్ అచ్చమైన కెరీర్ మహిళ. రెండు దశాబ్దాల నుంచీ ఆమెకు మైక్రో సాఫ్ట్తో అనుబంధం ఉంది. ఇప్పటివరకు క్లౌడ్ సొల్యూషన్స్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అలా అని ఉద్యోగానికే పరిమితం కాలేదు. బాలికలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ‘మైలిటిల్బిట్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. మహిళల ఆధ్వర్యంలో నడిచే స్టార్టప్లకు అండగా నిలుస్తున్న ‘సోండర్ కనెక్ట్’ సంస్థకు ట్రస్టీ. ఇరినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పట్టభద్రురాలు. ఎక్స్ఎల్ఆర్ఐ నుంచి ఎంబీఏ చేశారు. వ్యాపారం, సాంకేతికతలో మహిళల పాత్ర పెరగాలన్నది ఆమె ఆకాంక్ష. మైక్రోసాఫ్ట్ నుంచి ‘స్ఫూర్తిదాయక మహిళ’ పురస్కారం అందుకున్నారు. ఇరినా.. మారథాన్ రన్నర్, సంగీత ప్రేమికురాలు కూడా.
“మోడల్ అంటే అందంగానే ఉండాలా?”
“కార్పొరేట్ జాబ్ వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పెయింటింగ్లు వేయిస్తున్నాడు.. ఎందుకో తెలుసా”
Indina bald woman | గుండు అయితేనేం.. గుండెనిండా విశ్వాసం!”
సపోట నుంచి తేనె దాకా అన్నింటితో వైన్.. మరాఠా అమ్మాయి ఆలోచన అదుర్స్”