Bengaluru | ప్రియుడి కోసం కన్న కూతుర్నే హత్య చేసిన తల్లి.. బెంగళూరులో కలకలం!
Bengaluru | ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసిన ఓ మహిళ.. తన ఆరేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసింది. స్వతహాగా లాయర్ కావడంతో కుమార్తె మర్డర్‌ను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది.
Bengaluru | ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసిన ఓ మహిళ.. తన ఆరేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసింది. స్వతహాగా లాయర్ కావడంతో కుమార్తె మర్డర్‌ను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది. కానీ చిన్నారి మరణంపై అనుమానం వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే ప్రియుడిని అరెస్టు చేయగా.. చిన్నారి తల్లి మాత్రం తప్పించుకుని పారిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దావణగెరెకు చెందిన పి.ప్రియాంక అనే న్యాయవాదికి 2007లో ఉపాధ్యాయుడు ప్రవీణ్ బసప్పతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (15), కుమార్తె వెనిలా(6) సంతానం ఉన్నారు. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకుంటుండగా.. 2025లో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 2025లో ఫ్యామిలీకి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి బెంగళూరుకు ప్రియాంక వెళ్లింది. అక్కడ ఆమెకు తన కాలేజీ స్నేహితుడు జీఎం మోహన్ మళ్లీ కనిపించాడు. ఆ సమయంలో మోహన్ తన బాగోగుల గురించి చెబుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించానని తెలిపాడు. అప్పటి నుంచి మోహన్‌తో ప్రియాంక సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను వదిలేసింది. మోహన్‌తో సహజీవనం మొదలుపెట్టింది.
భర్తను కుమారుడి దగ్గరే వదిలేసి, కుమార్తె వెనీలాను తనతో పాటు ప్రియాంక తీసుకెళ్లింది. బెంగళూరులోని సీగెహళ్లిలో అద్దె విల్లాలో నివాసం ఉంటూ మోహన్‌తో సంబంధంలో ఉంది. అనంతరం ఇద్దరూ కాశీ(వారణాసి) వెళ్లి రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్‌కు కూడా వెళ్లొచ్చారు. 2026 జనవరిలో ప్రవీణ్ దగ్గరకు వచ్చిన ప్రియాంక.. విడాకుల పత్రాలపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ సమయంలో కుమార్తెను కూడా కలవనివ్వనని బెదిరించింది.
ఇదిలా ఉంటే మూడు నెలల క్రితం కుమార్తె చనిపోయిందని ప్రవీణ్‌కు ప్రియాంక ఫోన్ చేసి చెప్పింది. మార్చి 24వ తేదీన వెనీలా పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంక ఆమెను బయటకు తీసుకెళ్లింది. బిర్యానీ, ఐస్‌క్రీం తినిపించామని.. తర్వాత తను నిద్రపోతే కారులోనే ఏసీ ఆన్ చేసి ఉంచి, మోహన్‌తో తాను కాఫీ షాపునకు వెళ్లానని చెప్పింది. తిరిగి వచ్చాక ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టానని.. తెల్లారి ఉదయం వెనీలా లేవకపోవడంతో వైట్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారని పేర్కొంది.
అయితే చిన్నారి మృతిపై తండ్రి ప్రవీణ్ అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదిక కావాలని కోరాడు. దీంతో ప్రియాంక పోస్టుమార్టం రిపోర్టును ఏప్రిల్ 4న ప్రవీణ్‌కు ఇచ్చింది. ఆ రిపోర్టును ఇంగ్లండ్‌లో చిల్డ్రన్ డాక్టర్‌గా పనిచేస్తున్న సోదరి పూర్ణిమకు పంపించాడు. వెనీలా పోస్టుమార్టం నివేదిక పరిశీలించిన ప్రియాంక.. పలు అనుమానాస్పద అంశాలు ఉన్నాయని గుర్తించింది. దీంతో ప్రవీణ్ కడుగోడి పోలీసులను ఆశ్రయించాడు. తన కుమార్తెను చంపేసి, డ్రామాలు ఆడుతున్నరని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు జూన్ 4వ తేదీన హత్య కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రియాంక పరారీ కాగా.. మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాంక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చిన్నారిని విష ప్రయోగం చేసి చంపారా? లేక ఊపిరాడకుండా చేసి హత్య చేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంకను అరెస్టు చేసిన తర్వాతనే ఈ విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

