Woloo App | దేశంలో మహిళల జనాభా 66 కోట్లకు పైగా ఉంది. అయినా బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రమైన, అనుకూలమైన టాయిలెట్స్ లేవు. ఎక్కడో ఓచోట ఉన్నా, అవసరం వచ్చిన ప్రతిసారీ అక్కడి వరకూ వెళ్లలేరు కదా. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వచ్చిందే ‘ఉలూ’.
ఇప్పటికే ముంబై, పుణె నగరాల్లో ఉలూ పౌడర్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మనం ఉన్న చోటికి దగ్గర్లో ఉలూ టాయిలెట్ ఎక్కడుందనేది ‘ఉలూ’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉలూ రూమ్స్ ముంబైలోని 1200కి పైగా రెస్టారెంట్స్, కెఫేలతో అనుసంధానమై పనిచేస్తున్నది. రోజుకు ఒక రూపాయి లెక్కన ఏడాది కాలానికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, బయటికి వెళ్లినప్పుడు నిశ్చింతగా ఉలూ రూమ్‌లను వాడుకోవచ్చు. ఇందులో కొన్ని మెట్రో, రైల్వే స్టేషన్లకు దగ్గర్లో ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లాంటి ఇతర నగరాలకూ విస్తరించే ఆలోచన ఉందట.
“Video: రైలు పట్టాల మధ్యలో పడుకున్న మహిళ… రైలు వెళ్లిన తర్వాత ఏం చేసిందంటే?”
“పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?”
“ప్రపంచాన్ని చుట్టేయాలనుకునే మహిళల కోసమే ఈ సర్వీసులు.. మీరు లుక్కేయండి”
“అవకాశం వస్తే ఆర్టీసీ డ్రైవర్ కొలువు చేస్తానంటున్న కరీంనగర్ ఆడబిడ్డ.. ఎందుకంటే”