nara dishti | మన దేశంలో నరదిష్టిని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. పొరుగుదేశం పాకిస్తాన్‌లోనూ దీనిని విశ్వసిస్తారు. పైగా ఉత్తర భారతదేశంలో ‘చష్మే బద్దూర్’ (చెడు దృష్టి పడొద్దు) అనే నినాదం కూడా ప్రచారంలో ఉంది. మనదేశంలో అయితే ‘నజర్ బట్టు’ (దిష్టి బొమ్మ) లేని ఇళ్లు ఉండవు. ఇంటి గుమ్మాలు మొదలుకుని హోటళ్లు, దుకాణాలు, వాహనాలపైనా ఈ బొమ్మలు దర్శనమిస్తూనే ఉంటాయి. నరదిష్టిపై ప్రజల్లో ఉండే నమ్మకాన్ని పసిగట్టిన ‘వెజ్ అండ్ నాన్‌వెజ్’ అనే సంస్థ ఓ కొత్త వ్యాపార వ్యూహాన్ని అమలు చేసింది.
నజర్ బట్టును క్యాప్‌లపై ముద్రించి మార్కెట్ చేసుకుంటున్నది. అంతేకాదు, ‘ఈ క్యాప్ పెట్టుకుంటే మీకు దిష్టే తగలదు. పైగా మీశక్తి రెట్టింపు అవుతుంది’ అనే నినాదాన్నీ రూపొందించింది. కరోనా మహమ్మారి ప్రబలడంతో వ్యాపారం పడిపోయింది. దాంతో ఇలా కొత్తగా ప్రయత్నించి లాభాలు ఆర్జిస్తున్నది ‘వెజ్ అండ్ నాన్‌వెజ్’. కొత్తదనాన్ని ఇట్టే పట్టేసే మన కుర్రాళ్లు.. నజర్బట్టు క్యాప్లతో వీధుల్లో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ టోపీ ధర ఎంతో తెలుసా? రూపాయి తక్కువ 500. ఈ సరికొత్త కాటన్ క్యాప్‌ను సొంతం చేసుకునేందుకు వేలాదిమంది వెబ్సైట్లో ఆర్డర్లు పెడుతున్నారట. అంతా నరదిష్టి మహిమ!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Dwarfs : ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే.. కారణం ఏంటో తెలుసా?
Drug Lab : యూట్యూబ్‌లో వీడియోలు చూసి డ్రగ్స్ తయారు చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు
రూ.13 కోట్లకు ఆ పార్ట్‌ను ఇన్సురెన్స్ చేయించుకున్న మోడల్
అశ్లీల వీడియోలతో మోడల్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఎఫ్బీ ఫ్రెండ్!
జూకు వెళ్లి సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి.. ఈ యువతి ఏం చేసిందంటే? వైరల్ వీడియో