న్యూఢిల్లీ: సిమెంట్ కంపెనీలు అక్టోబర్‌లో బస్తా ధరలను రూ.5-20 పెంచే అవకాశం ఉన్నదని సెంట్రమ్ బ్రోకింగ్ వెల్లడించింది. ఈ నెలలో భారత్‌లో బస్తా సిమెంట్ ధర సగటున రూ.7 పెరిగి రూ.356కు చేరుకొన్న నేపథ్యంలో ఈ అంచనా వెలువడింది.
దక్షిణాదిలో బ్యాగ్‌కు రూ.11, మధ్య, తూర్పు, ఉత్తర భారతంలో రూ.5, పశ్చిమ భారతాన రూ.9 మేర ధరలు పెరిగే అవకాశం ఉన్నది. డిమాండ్ రికవరీ, డీలర్ ఆమోదంపై సిమెంట్ ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది.