Gym Ball Benefits | శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోడానికి ఒకటే మార్గం.. వ్యాయామం. కసరత్తు అంటే పరుగెత్తడం, నడవడమేనా? కొత్తకొత్త పద్ధతులు వచ్చేశాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు కరిగించి శరీరాకృతిని కాపాడేవి కొన్నయితే.. శరీరంతోపాటు మనసునూ తేలికపరిచేవి మరికొన్ని. ఈ రెండురకాల ప్రయోజనాలనూ అందిస్తుంది జిమ్బాల్. ఈ బంతితో అనేక ప్రయోజనాలు.
కొత్తగా వ్యాయామం ప్రారంభించేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఏం చేయాలో, ఎంతసేపు చేయాలో తెలియని వాళ్లు ఈ బంతితో చిన్నచిన్న కసరత్తులు మొదలుపెట్టవచ్చు. తొలిదశలో జిమ్ బాల్‌తో ప్రారంభిస్తే.. శరీరానికి తేలికపాటి వ్యాయామం లభిస్తుంది. కండరాలూ అలవాటు పడతాయి. అంతేకాదు బంతిని బ్యాలెన్స్ చేస్తూ వ్యాయామం చేయడం ద్వారా.. శరీరాన్ని, మనసును బ్యాలెన్స్ చేసుకోవడమూ తెలుస్తుంది.
శరీరాకృతికి జిమ్బాల్ ఉత్తమ సాధనం. దీంతో రకరకాల వ్యాయామాలు చేయవచ్చు. భుజం, తొడ కండరాలకు మంచి కసరత్తు అవుతుంది. జిమ్బాల్తో ఇంటిని జిమ్‌గా మార్చుకోవచ్చు. పొట్ట రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారికి, పొట్ట తగ్గించుకోవాలనుకునే వారికి ఇదో ఉత్తమ మార్గం.
శ్వాస వ్యవస్థ మెరుగుపడి ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట, వెన్ను భాగాలను జిమ్బాల్పై ఆనించి వివిధ కసరత్తులు చేయడం వల్ల ఆయా కండరాల్లోని న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయి. తద్వారా నాడీ వ్యవస్థ చైతన్యమంతం అవుతుంది. కండరాలు బలపడతాయి. వెన్నునొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలను నియంత్రించడంలో జిమ్బాల్ ఎంతో ఉపయోగపడుతుంది.
“ఏం తిన్నా, ఎంత తిన్నా ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయాలంటున్న పూజా హెగ్డే”