చిన్నప్పుడు ఆడిన తాడాటను లైట్ తీసుకోకండి.. దీంతో ఆడితే ఎన్ని లాభాలో !!
Obesity | కొవ్వు కరిగించుకోవడంలో ఎవరి దారి వారిది. జిమ్‌లకు వెళ్తున్నారు, యోగా చేస్తున్నారు, క్రాష్ డైట్‌కు సిద్ధపడుతున్నారు. కానీ, ‘చంకలో పిల్లను పెట్టుకుని..’ సామెతను తలపించేలా చిన్నప్పుడు ఆడుకున్న ‘తాడాట’ను మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు. అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ ‘మేరే పాస్ మా హై’ అన్నట్టు, చేతిలో తాడు ఉంటే చాలు.. ఊబకాయం తాడు తెంచేయవచ్చు.
అది నిత్యం రద్దీగా ఉండే ముంబై వీధి. ఓ కుర్రాడు సర్రున దూసుకొచ్చాడు. అంతలోనే స్పీకర్లో ఊపు తెప్పించే పాట. సంగీతానికి తగ్గట్టు స్కిప్పింగ్ రోప్‌తో కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తున్నాడు. ఎవరో ఆ ఘట్టాన్ని వీడియో తీస్తున్నాడు. అంతా రెప్పవాల్చకుండా చూస్తున్నారు. తర్వాత స్కిప్పింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాడు. వీడియోను లైవ్‌లో చూస్తున్నవారంతా ఆ యువకుణ్ని లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. షేర్ల వర్షం కురిపిస్తున్నారు. అతనే చేతన్ తాంబే. జంపింగ్ రోప్‌తో ట్రెండ్ క్రియేటర్‌గా మారి సోషల్ మీడియాలో వేలాదిమందిని తన వైపు తిప్పుకొన్నాడు. ‘స్కిప్పింగ్‌తో బరువు తగ్గడం ఎలా?’ అన్న విషయం మీద ఇప్పటికే వందల మందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు.

తాడాట టు పసుపుతాడు
ప్రతుల్ మహేశ్వరి వయసు ముప్పై ఒకటి. అప్పటికే అతను కొంచెం లావు. లాక్డౌన్ కారణంగా మరింత బరువు పెరిగాడు. అద్దంలో చూసుకొని తనను తాను చీదరించుకునే పరిస్థితి. సోదరుడి సలహా మేరకు స్కిప్పింగ్ ఎంచుకున్నాడు. సరికొత్త టెక్నిక్స్ కోసం కొన్ని వీడియోలు చూశాడు. సులువుగా ఉన్నవాటినే మొదట ప్రయత్నించాడు. ఏడు నెలల్లోనే 20 కిలోలు తగ్గాడు. ఎప్పటికప్పుడు వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేసేవాడు. తన ఫాలోవర్స్లోనే ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఓ ఇంటివాడూ అయ్యాడు. ఇప్పుడు అధికబరువుతో బాధపడుతున్న వారికి అతను స్కిప్పింగ్ గురువు.

కిక్కిచ్చే ‘డబుల్ డచ్’..
డబుల్ ధమాకా లాంటి స్కిప్పింగ్.. డబుల్ డచ్ లేదా జంప్ రోప్. ఈజిప్ట్, చైనాల్లో ‘డబుల్ డచ్’ ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఇప్పుడు మన దగ్గరా క్రేజీగా మారింది. రెండు తాళ్లను వ్యతిరేక దిశల్లో తిప్పుతూ.. దాదాపు ఏడుగురు ఆ తాళ్ల మధ్యలో విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తారు. చైనాలో ట్రిపుల్ రోప్‌తో కూడా విన్యాసాలు చేస్తుంటారు. ‘జంప్ రోప్’ అంతర్జాతీయ క్రీడగానూ వెలుగొందుతున్నది. 2008లో ‘జంప్ రోప్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటైంది. 2012 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రీడాకారులు పతకాలు కూడా సాధించారు. ఒలింపిక్స్‌లో ఈ గేమ్‌ను చేర్చే విషయమై ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. న్యూయార్క్ పోలీస్ శాఖ యువతను మత్తు మార్గం నుంచి తప్పించేందుకు జంప్ రోప్‌ను ఆయుధంగా మలుచుకున్నది. ‘రోప్ నాట్ డోప్’ అంటూ యాంటీ డ్రగ్ డ్రైవ్‌ను రూపొందించింది. ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. మన పోలీసులు కూడా ఈ నినాదాన్ని అందుకోవచ్చు. ‘మత్తు వదలండి.. తాడు పట్టండి’ అని పిలుపునివ్వవచ్చు.

ట్రెండ్ సెట్టర్..
ఎంతోమంది స్కిప్పింగ్‌తో ఆరోగ్య అన్వేషణ కొనసాగిస్తున్నారు. పాదాల నుంచి తల వరకూ ధారాళంగా చెమటలు పట్టించే అతి చవకైన వ్యాయామం ఇది. ఓ మంచి తాడు ఉంటే సరిపోతుంది. బరువులు ఎత్తి కండరాల నొప్పులు తెచ్చుకోవడం కంటే.. శరీరంలోని అన్ని అవయవాలనూ కదిలించే స్కిప్పింగ్ చాలా ఉత్తమమని అంటున్నారు ఫిట్నెస్ గురువులు. అయితే రోప్‌తో విన్యాసాలు చేసేముందు నిపుణుల సలహా తప్పనిసరి. ఇదొక సరదా సరదా వ్యాయామం కావడంతో ఔత్సాహికులు స్కిప్పింగ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
Read More :
అధిక బరువు తగ్గాలంటే ఈ చాలెంజ్ చేయండి..!!
ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే, ఈ పనులు వెంటనే చేయండి..!!”
Obesity | అధిక బరువుతో కుంగుబాటు ముప్పు!”
గుడ్డు తినండి.. బరువు తగ్గండి”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- exercise
- Obesity
- Weight loss
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

