అధిక బరువుతో కుంగుబాటు ముప్పు!

లండన్ : అధిక బరువు కుంగుబాటుకు దారితీసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. స్ధూలకాయం శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది తెలిసిందే అయినా తాజాగా ఇది మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని జర్నల్ హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్‌లో ప్రచురితమైన అధ్యయన నివేదిక వెల్లడించింది. బ్రిటన్‌లో ప్రతి నలుగురిలో ఒకరు స్ధూలకాయంతో బాధపడుతుండగా చిన్నారుల్లోనూ ఈ సమస్య తీవ్రమవడం సవాల్‌గా మారిందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిక బీఎంఐ కుంగుబాటుకు ఎలా దారితీస్తుందనేది తెలుసుకునేందుకు పరిశోధకులు జన్యు విశ్లేషణ పద్ధతిని అనుసరించారు. యూకే బయోబ్యాంక్ నుంచి 1,45,000 మందికి సంబంధించిన జన్యు డేటాను ఎక్సెటర్ యూనివర్సిటీ పరిశోధకులు విశ్లేషించి ఈ వివరాలు రాబట్టారు. అధిక బీఎంఐకి సంబంధించిన జన్యు వేరియంట్లను పరిశోధకులు విశ్లేషించి స్ధూలకాయం, కుంగుబాటుకు ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు.
అధిక బీఎంఐ కుంగుబాటుకు దారితీస్తుందని తమ పరిశోధనలో వెల్లడైందని అధ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ మెడికల్ స్కూల్ జెస్ ఓలాలిన్ తెలిపారు. స్ధూలకాయం జీవక్రియల పనితీరుతో సంబంధం లేకుండా కుంగుబాటు ముప్పునకు దారితీస్తుందని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. శారీరక ఆరోగ్యం, సామాజిక కారణాలు కూడా స్ధూలకాయం, కుంగుబాటు మధ్య సంబంధంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

