న్యూఢిల్లీ: చిన్నపిల్లలనుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే అన్ని వయసులవారు నిత్యం ఓ అరగంటపాటైనా ఎక్సర్సైజెస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వృద్ధులు తమ వయస్సును సాకుగా చూపి వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. అలసట, ఆయాసంవల్ల కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తుంటారు. అయితే, ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే వృద్ధులు కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు నిత్యం వ్యాయామం చేస్తే ఐదురకాల ప్రయోజనాలుంటాయని తెలిపారు.