రోజూ ఆ పనిచేస్తే ఎక్కువకాలం జీవించవచ్చట..!
Health Tips: ఈ రోజుల్లో దాదాపు 70 శాతం మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్, రక్తంలో కొలెస్టరాల్ లాంటి జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ దీర్ఘాకాలిక వ్యాధులతో అప్పటికప్పుడు వచ్చే సమస్య ఏమీ లేకపోయినా దీర్ఘకాలికంగా చూసుకుంటే మాత్రం

హైదరాబాద్: ఈ రోజుల్లో దాదాపు 70 శాతం మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్, రక్తంలో కొలెస్టరాల్ లాంటి జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ దీర్ఘాకాలిక వ్యాధులతో అప్పటికప్పుడు వచ్చే సమస్య ఏమీ లేకపోయినా దీర్ఘకాలికంగా చూసుకుంటే మాత్రం ఆయుఃప్రమాణం తగ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారితో పోల్చితే ఈ వ్యాధులు ఉన్నవారి ఆయుష్షు తక్కువగా ఉంటుంది. అయితే, వ్యాధులతో సంబంధం లేకుండా ఎవరైనా నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆయుఃప్రమాణాన్ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలి వ్యాధులతో బాధపడేవారికి ఆరోగ్యం మెరుగుపడటానికి, ఏ అనారోగ్యం లేనివారికి ఆయుష్షు పెరుగడానికి వ్యాయామం చాలా బాగా పనిచేస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మనిషి జీవిత కాలం పెరుగాలంటే ప్రతిరోజు సగటున 7 వేల అడుగులు నడవాల్సిందేనని సూచిస్తున్నారు. లేదంటే వారంలో కనీసం రెండున్నర గంటలు శారీరక శ్రమ చేయాల్సిందేనని చెబుతున్నారు. ఇటీవల జరిగిన అధ్యయనాల ఫలితాల ఆధారంగా నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు.
10 వేల మంది స్త్రీలు, పురుషులపై అధ్యయనం
పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు టెన్నిస్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్ లేదా బ్యాడ్మింటన్ లాంటి క్రీడలపట్ల దృష్టిపెడితే శరీరాలకు మంచి వ్యాయామం అవుతుందని ఇటీవల రెండు వేర్వేరు అధ్యయనాల్లో తేలింది. ఈ రెండు అధ్యయనాలు కూడా శారీరక శ్రమతోనే మనిషి జీవితకాలం పెరుగుతుందని స్పష్టంచేశాయి. దశాబ్దకాలంగా దాదాపు 10 వేల మంది స్త్రీలు, పురుషుల అభిప్రాయాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వచ్చిన ఫలితాల ఆధారంగా నివేదికను రూపొందించారు.
శరీరాలకు కావాల్సినంత వ్యాయామం లేకపోవడంవల్ల గుండెపోటు, పక్షవాతం లాంటివి సంభవించి అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఈ అకాల మరణాలను 70 శాతం వరకు తగ్గించవచ్చని నూతన అధ్యయనాల్లో తేలింది. సాధారణ వ్యాయామంతోపాటు యోగాసనాలు వేసేవాళ్లు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని ఈ అధ్యయనాలు సూచించాయి. వ్యాయామాలవల్ల ఆయుర్దాయం పెరుగడమేగాక వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.
నిత్య శారీరక శ్రమే శ్రీరామరక్ష
నిత్యం వ్యాయామాలు చేసేవాళ్లతో పోల్చితే.. అస్సలు వ్యాయామం చేయనివాళ్లు, అరుదుగా వ్యాయామం చేసేవాళ్లలో వ్యాధినిరోధక శక్తి తగ్గినట్లు పరిశోధనలు స్పష్టంచేశాయి. 2018లో అమెరికాలో ఓ అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనం ప్రకారం అమెరికన్లలో 40 నుంచి 70 ఏండ్ల మధ్య వయసువారి మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. వారిలో 10 శాతం మంది మరణాలకు చాలా తక్కువ సమయం వ్యాయామం చేయడమే కారణమని తేలింది. కాబట్టి నిత్యం వ్యాయామం చేయడం అన్నివిధాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

