మీరు జంక్‌ఫుడ్‌కు బానిసలయ్యారా? అధిక బరువు వేధిస్తున్నదా? స్పైసీ ఫుడ్‌ను చూస్తే మీ మనసు ఆధీనంలో ఉండటం లేదా? అయితే, మీ బ్రెయిన్‌ను దారిలో పెట్టి జంక్‌ఫుడ్డు జోలికి వెళ్లకుండా చేసే ఓ యాప్ మార్కెట్లోకి వచ్చింది.
జంక్‌ఫుడ్‌ను మితిమీరి తినడం వల్ల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు కొందరు. అటువంటి వారిని గాడిలో పెట్టేందుకు ‘ఫుడ్టి’ అనే యాప్ సమర్థంగా పని చేస్తున్నట్లు యూకేలోని యూనివర్సిటీలు గుర్తించాయి. ప్రత్యేకంగా పరిశోధన చేసి ఈ యాప్‌ను రూపొందించారు ఎక్సెటర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు. ‘ఫుడ్టి’ యాప్ ఎలా మెదడును కంట్రోల్ చేస్తుందనేగా మీ అనుమానం? ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ వివరాలు ఇవ్వాలి. యాప్‌లో చూపిన మూడు ఫుడ్స్‌పై మీరు క్లిక్ చేసి, టచ్ గేమ్ ఆడటమే. ప్రతి ఫుడ్‌లోనూ మూడు రౌండ్స్ ఉంటాయి. వాటిలో రెడ్, గ్రీన్ సర్కిల్స్ వస్తుంటాయి. గ్రీన్ సర్కిల్‌ను టచ్ చేస్తే మీకు పాయింట్లు లభిస్తాయి. రెడ్ సర్కిల్‌ను టచ్ చేస్తే మైనస్ పాయింట్లు పడతాయి.
గ్రీన్ సర్కిల్లో మంచి ఫుడ్, ఆరోగ్యాన్నిచ్చే వస్తువులు కనిపిస్తుంటాయి. రెడ్ సర్కిల్లో మీరు తినకూడని ఆహారాలు మాత్రమే దర్శనమిస్తాయి. దానివల్ల, అవి ఆరోగ్యానికి హానికరమనే మెసేజ్ ఆటోమేటిక్‌గా మెదడుకు వెళ్తుంది. ఈ ‘ఫుడ్టి’ యాప్ గేమ్‌లో స్కేల్ ఆధారంగా 8 పాయింట్లు సాధించిన వారు సగటున ఒక జంక్‌ఫుడ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారని ఎక్సెటర్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. మరి, ఇంకెందుకు ఆలస్యం, జంక్‌ఫుడ్‌ను వదలించుకోవాలంటే మీరూ FoodT యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, గేమ్ స్టార్ట్ చేయండి.