స్ట్రాబెర్రీ: అత్యధిక స్థాయిలో యాంటిఆక్సిడెంట్లు లభించే పండ్లలో స్ట్రాబెర్రీలు ముందుంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. వీటిలోని పాలీఫినాల్ సమ్మేళనాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. స్ట్రాబెర్రీల్లో సమృద్ధిగా దొరికే విటమిన్ సి మూలకాలు.. శరీరంలోని పోషక లోపాలను సవరిస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత శక్తి లభించడంతోపాటు ఆక్సిజన్ స్థాయులూ పెరుగుతాయి.
మామిడి: రుచిలోనే కాదు.. మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించడంలోనూ మామిడి పండు రారాజే! మామిడి పండ్లలో ‘బీటా కెరోటిన్’ అనే పదార్థం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతో సాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి.. శరీరానికి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.