Sara Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా పేరు ఈమధ్య వార్తల్లో బాగా వినిపిస్తున్నది. త్వరలోనే బాలీవుడ్లో అడుగు పెడుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఆ పుకార్లపై సారా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తను లండన్‌లో మెడిసిన్ చేసింది. మోడలింగ్ అంటే ఆసక్తి. ర్యాంప్ మీద మెరిసి అందరి దృష్టినీ ఆకర్షించింది. చిన్నప్పటి నుంచీ సినిమాలు బాగా చూసేది. నటనలో శిక్షణ కూడా తీసుకుంది. కొన్ని బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన అనుభవం ఉంది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న సారా నిర్ణయానికి తండ్రి సచిన్, తల్లి అంజలి మద్దతు ఇచ్చినట్టు బలంగా వినిపిస్తున్నది. ఈ మధ్య సారా లోప్రొఫైల్‌గా ఉంటున్నది. ఒకేసారి సినిమా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడంలో ఇదో భాగమన్న వాదనా లేకపోలేదు. నాన్న మైదానంలో అద్భుతాలు చేసినట్టే.. కూతురు వెండితెర మీద దుమ్మురేపుతుందేమో!
“Sara Tendulkar | సిల్వర్ స్క్రీన్‌పై సచిన్ కూతురు ఎంట్రీ..నిజమెంత..?”
“జిమ్ డ్రెస్సులో సారా టెండూల్కర్.. లైక్ కొట్టిన బాలీవుడ్”
Viral photo: ఆరు నెలల కొడుకుతో కలిసి నేహదూపియా అదోముఖ శ్వాసనం..ఫొటోలు వైరల్”
“Jhund OTT Date | ఓటీటీలోకి అమితాబ్ లేటెస్ట్ హిట్ ‘జుండ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?”