పాలనపై సూటిగా ప్రశ్నలు అడిగితే సమాధానం దాటవేసి వ్యక్తిగత దూషణల్లు, రెచ్చగొట్టే మాటలతో ‘కృత్రిమ ఆగ్రహాన్ని’ తెరపైకి తెస్తారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగంలోని అసలు సమస్యలను అటకెక్కించి, ఎవరు ఎవర్ని తిట్టారనే చిల్లర లొల్లి చుట్టూ రోజంతా రచ్చ జరిగేలా చేస్తారు. ఈ ఎత్తుగడ మీడియాలో సంచలనం సృష్టించవచ్చు గానీ, జవాబుదారీతనాన్ని దెబ్బతీస్తుంది. వ్యక్తిగత నిందలు వేయడానికి ఆధారాలు అక్కర్లేదు, నోరుపారేసుకుంటే దాని చుట్టూనే చర్చ నడుస్తున్నది.
చైనా ప్రాచీన యుద్ధ వ్యూహకర్త సన్ జు ది ఆర్ట్ ఆఫ్ వార్లో ఓ మాట చెప్పారు. అది ‘If your opponent is of choleric temper, seek to irritate him.’ సర్కార్ వేసిన ఈ కవ్వింపు వలలో పడి, ప్రతిపక్షం కూడా అదే ఆవేశంతో వ్యక్తిగత దూషణలకు దిగితే ప్రత్యర్థి పన్నిన ఉచ్చులో పడ్డట్టే అవుతుంది. ప్రజా సమస్యల స్థానంలో తిట్ల పురాణమే ప్రధాన వార్తగా మారిపోతుంది. రాజకీయాల్లో సంక్షోభం ఎదురైనప్పుడు ఆవేశపడకుండా నిబ్బరంగా ఉండగలగడమే నాయకుడికి అసలైన పరీక్ష. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడనే ఆరాటంలో పడి సొంత కర్తవ్యాన్ని మర్చిపోవద్దని రోమన్ చక్రవర్తి, స్టోయిక్ తత్వవేత్త మార్కస్ అరేలియస్ మెడిటేషన్స్ పుస్తకంలో ఈ విధంగా హెచ్చరించారు.
‘Do not waste what remains of your life in speculating about your neighbors and what they are doing… for this diverts you from paying attention to your own governing power.’ బయటి శబ్దాలు మనల్ని ఏమీ చేయలేవని, వాటికి మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టే వాటి బలం ఉంటుందని ఇలా గుర్తుచేశారు. ‘If you are distressed by anything external, the pain is not due to the thing itself, but to your estimate of it; and this you have the power to revoke at any moment.’
అలాగే కవ్వింపులకు లొంగి కోపోద్రిక్తులైతే విచక్షణ ఎలా నాశనమవుతుందో శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. ‘క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః/ స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి.’ అనగా ఆగ్రహం పెరిగితే లక్ష్యం తప్పుతుంది. లక్ష్యం తప్పితే విచక్షణ పోతుంది, విచక్షణ కోల్పోతే నాయకత్వం ప్రత్యర్థి వలలో చిక్కుకుంటుంది. అందుకే సంయమనం అంటే చేతగానితనం కాదు. లక్ష్యాన్ని కాపాడుకునే అసలైన అంతర్గత బలం. నిండు సభలో అవమానాలు, అరణ్యవాసపు కష్టాలు ఎదురైనప్పుడు ధర్మరాజు ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు. అది పిరికితనం కాదు, వ్యూహాత్మక క్రమశిక్షణ. ప్రత్యర్థి చిన్నపాటి ఎర వేయగానే ఆవేశపడి అసలు లక్ష్యాన్ని ఆయన భగ్నం చేసుకోలేదు. ఆ ఓర్పుతో కూడగట్టిన బలమే కురుక్షేత్రంలో సర్వసైన్యాధిపత్యంగా మారింది. శత్రువుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిన వ్యూహకర్త ఆయన. సంక్షోభాల్లో సైన్యాన్ని నడిపించి గెలిపించిన నాయకుడు. సమయం వచ్చేదాకా బలాన్ని దాచుకుని, నిర్ణయాత్మక వేదికపై దెబ్బకొట్టడమే నిజమైన రాజనీతి. ఈ కర్తవ్య నిష్ట గురించే శ్రీకృష్ణుడు అర్జునుడికి హితవు పలికారు. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన/ మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్తకర్మణి.’ ఫలితం గురించి పట్టించుకోకుండా నిర్వర్తించాల్సిన బాధ్యత మీదే దృష్టి పెట్టాలన్నది దీని పరమార్థం.
అడ్డా మనదే కావాలె ఆటా మనదే కావాలె
సన్ జు యుద్ధతంత్రం గురించి ఇలా చెప్పారు. ‘Therefore the clever combatant imposes his will on the enemy, but does not allow the enemy’s will to be imposed on him.’ ఈ సూత్రం ప్రకారం ప్రత్యర్థి రమ్మన్న మైదానానికి పోయి కొట్లాడటం సరికాదు. ప్రజల సమస్యలను ముందుకు తెచ్చి, ప్రత్యర్థే ఆత్మరక్షణలో పడేలా చేయాలె. Appear at points which the enemy must hasten to defend; march swiftly to places where you are not expected. ఎప్పుడు కొట్లాడాలె, ఎప్పుడు కొట్లాడొద్దు అన్న విచక్షణే గెలిపిస్తుంది. He will win who knows when to fight and when not to fight. అలాగే వ్యూహం నీటి ప్రవాహంలా సాగిపోవాలె. Military tactics are like unto water; for water in its natural course runs away from high places and hastens downwards. So in war, the way is to avoid what is strong and to strike at what is weak. నీరు రాతి గోడతో మొరపెట్టుకోదు. పక్కనుంచి ప్రవహిస్తుంది. ప్రత్యర్థి తెచ్చిన వివాదం దగ్గరే ఆగిపోకుండా, ప్రజల సమస్యలతో ముందుకెళ్లడమే సరైన ఎత్తుగడ. ప్రజాక్షేత్రమే కొలమానం. రాజకీయాల్లో ప్రజా సంక్షేమమే పరమావధి అని కౌటిల్యుని అర్థశాస్త్రం నిర్దేశించింది. In the happiness of his subjects lies his happiness. in their welfare his welfare. Whatever pleases himself he shall not consider it as good, but whatever pleases his subjects he shall consider as good. ఓపికతో వేచి చూసి దెబ్బకొట్టే విచక్షణకు చాణక్య నీతి కొంగను ఉదాహరణగా చెప్పింది. A wise man should control his senses like a crane and accomplish all his tasks by knowing the appropriate place, time, and his own strength.
మాకియవెల్లీ The Prince గ్రంథంలో చెప్పిన నక్క-సింహం రూపకం కూడా ఇదే సూచిస్తుంది. A prince, therefore, being compelled to know well how to use the beast, ought to choose the fox and the lion; because the lion cannot defend himself from traps and the fox cannot defend himself from wolves. One must therefore be a fox to discover the snares and a lion to terrify the wolves.
ఉచ్చులను పసిగట్టేందుకు నక్కలాంటి వివేకం, ప్రజా సమస్యలపై సర్కార్ను నిలదీసేందుకు సింహంలాంటి ధైర్యం రెండూ నాయకుడికి ఉండాలె. ఆధారాలతో ప్రశ్నించే నాయకత్వమే జవాబుదారీతనాన్ని రాబట్టగలదు. దీనికోసం రాజకీయ కార్యాచరణలో స్పష్టమైన క్రమశిక్షణ ఉండాలె. ఎదుటివారు ఏమన్నా వెంటనే మీడియాలోనో, సోషల్ మీడియాలో నో వ్యక్తిగతంగా స్పందించడం అవసరం ఉన్న దా లేదా ఆలోచించాలి. నిరుద్యోగం, రైతాంగ కష్టాలు, సంక్షేమం లాంటి వంటి ప్రజల ఎజెండాపైనే పట్టువిడవకుండా మాట్లాడాలె. ప్రతి చిల్లర వివాదానికీ స్పందించాల్సిన పనిలేదు. ఆధారాలతో ఖండించాల్సినవి కొన్ని ఉంటే, పట్టించుకోకుండా వదిలేయాల్సినవి మరికొన్ని ఉంటాయి. ఈ రోజు ప్రజాచర్చను ఎవరు నడిపించారు? అని రోజూ సమీక్షించుకోవాలె. ఆ సమాధానం నిరంతరం ప్రత్యర్థి వైపే ఉంటే, లో పం మన వ్యూహంలోనే ఉన్నదని గ్రహించాలె.
క్షేత్రస్థాయి ప్రజల గోడును వినడం, పనికిరాని వివాదాలను తోసిపుచ్చి ప్రజా సమస్యలను ఎంచుకోవడం, విధానపరమైన పరిష్కారాలతో ప్రజాచర్చకు తానే దిశను నిర్దేశించడం ప్రతిపక్షానికి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత. రేపటి ప్రజాచర్చను శాసించేటోడే అసలైన విజేత! వ్యక్తిగత తిట్లు పాలనా వైఫల్యాలకు సమాధానాలు కాజాలవు. భావోద్వేగాల ప్రదర్శన వాస్తవ ఆధారాలకు ప్రత్యామ్నాయం కాదు. ఆగ్రహం బుద్ధిని నాశనం చేస్తుందన్న గీతాబోధ, ధర్మరాజు చూపిన వ్యూహాత్మక ఓర్పు ఒకటే స్పష్టం చేస్తున్నాయి.
‘ఎదుటివారి కవ్వింపులకు లొంగి నీ అసలైన కర్తవ్యాన్ని వదులుకోవద్దు.‘ రాజకీయాల్లో ఎవరు ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నారు, ఎవరు ఎక్కువ ప్రెస్మీట్లు పెట్టారన్నది ముఖ్యం కాదు. ప్రజాచర్చను ఎవరు నడిపించారన్నదే ముఖ్యం. ఈ రోజు ప్రత్యర్థి ఏమన్నాడు? అని ఆందోళన చెందే రాజకీయం ఎప్పుడూ ఆత్మరక్షణలోనే ఉంటుంది. రేపు ప్రజలు దేనిపై చర్చించాలె? అని ముందుచూపుతో ఎజెండాను నిర్దేశించే పక్షమే విజయం సాధిస్తుంది. ప్రజానాడిని స్పష్టంగా గ్రహించి, తగిన తరుణంలో ప్రజల్లోకి రావడమే కేసీఆర్ రాజకీయ విజయ రహస్యం. తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఉన్న అసలైన వ్యూహం కూడా అదే.
పెండ్యాల మంగళాదేవి