Bhool Bhulaiyaa-2 | ‘అందులో ఉన్న ఆత్మ సామాన్యమైనది కాదు’.. ఆకట్టుకుంటున్న ‘భూల్ భూలైయా-2’ ట్రైలర్
Bhool Bhulaiyaa-2 Trailer | ‘లుకాచుప్పి’, ‘పతి పత్నీ ఔర్ వో’, ‘ధమాకా’ వంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భూల్ భూలైయా-2’. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘భూల్ భూలైయా’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో ఈ చిత్రం హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘మణిచిత్రతాఝు’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళ్, తెలుగులో చంద్రముఖిగా తెరకెక్కింది. భూల్ భూలైయా చిత్రం వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరో ఆ తలుపును తట్టారు. అందులో ఉన్నది సామాన్యమైన ఆత్మ కాదు. అందులో ఉంది మంజులిక’ అంటూ టబు చెప్తుండటంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కియరా అద్వాని కోసం కార్తిక్ ఆర్యన్ మంత్ర గాడిలా వేషం వేసుకుని ఆ ఇంట్లోకి వచ్చినట్లు ట్రైలర్ చేస్తూ తెలుస్తుంది. మధ్యలో కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘భుల్ భులైయా పార్ట్-1’ ఎక్కడ ముగిందో ఈ సీక్వెల్ అక్కడి నుంచే ప్రారంభమవుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాజ్‌పాల్ యాదవ్, పరేశ్ రావల్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ‘టీ-సిరీస్’, ‘సినీ1 స్టూడీయోస్’ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. కామెడీ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

