Indian Idol Telugu Winner Vagdevi | ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఓటీటీలోనూ పాటకు పట్టాభిషేకం చేసింది. నువ్వానేనా అన్నట్టు జరిగిన పోటీలో మేలిమి ముత్యంలా నిలిచి ట్రోఫీని దక్కించుకుంది బి.వి.కె.వాగ్దేవి. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల అండతోనే ఈ విజయం సాధ్యమైందని చెబుతున్న వాగ్దేవి ముచ్చట్లు..
మాది నెల్లూరు. నా చిన్నప్పుడు అక్క సంగీతం నేర్చుకునేది. ఇంటికొచ్చాక, క్లాసులో చెప్పిన స్వరాలను సాధన చేసేది. అప్పుడప్పుడు నేనూ అక్కతో గొంతుకలిపేదాన్ని. నా ఆసక్తిని గమనించిన అమ్మ నన్నూ సంగీతం క్లాసులో చేర్పించింది. అలా అక్కతోపాటే నా స్వరాల యాత్ర మొదలైంది. ఇద్దరం ‘వైవా సిస్టర్స్’ పేరుతో చాలా కచేరీలు చేశాం. ఏటా నెల్లూరులో జరిగే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో మా కచేరీ తప్పకుండా ఉంటుంది.
‘తెలుగు ఇండియన్ ఐడల్’ కంటే ముందు ఈటీవీ ‘పాడుతా తీయగా’లో సెమీ ఫైనల్స్ వరకూ వెళ్లాను. ‘ఆహా’లో ప్రేక్షకుల ఆదరణ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. న్యాయ నిర్ణేతలు బాగా గైడ్ చేశారు. అంతిమ విజేతగా నిలిచి, మెగాస్టార్ చిరంజీవిగారి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం నా అదృష్టం. సెమీ ఫైనల్స్‌కి బాలకృష్ణగారు వచ్చారు. నేను గెలిచాక ఫోన్ చేసి మరీ అభినందించారు. ఈ కార్యక్రమం నా జీవితంలో ఓ మైలురాయి.
నేను శ్రీశ్రీ యూనివర్సిటీలో బీఆర్క్ ఫైనలియర్ చదువుతున్నా. ఆర్కిటెక్చర్ పట్ల ఆసక్తి ఉన్నా, సంగీతాన్ని కెరీర్‌గా మలుచుకోవాలని నా కోరిక. కుదిరితే రెండిటినీ బ్యాలెన్స్ చేస్తాను. ‘తెలుగు ఇండియన్ ఐడల్’ విజేతగా నిలిచాక చాలా అవకాశాలు వస్తున్నాయి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం నాకు ఇష్టం. అందులోనూ కథల పుస్తకాలు ప్రాణం. ముందునుంచీ క్లాసికల్ జానర్లో వచ్చే పాటలంటేనే మక్కువ. అక్క, నేను ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా సాగుతూ.. సంగీత సామ్రాజ్యంలో ‘వైవా సిస్టర్స్’గా పేరు తెచ్చుకోవాలని కోరిక.
… ప్రవళిక వేముల
“ఏంటి.. విజయ్ సినిమాకు వంశీ పైడిపల్లి అదే చేస్తున్నాడా..?”
“గాడ్ ఫాదర్ విషయంలో చిరంజీవి మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!”
Indian Movies | కొత్త సినిమాలు శుక్రవారం మాత్రమే ఎందుకు రిలీజ్ అవుతాయి?”
“Rashikanna | తెలుగులో ‘రాశీఖన్నా’ ఇన్ని హిట్ సినిమాలను వదులుకుందా?”