God Father |సాధారణంగా ఒక భారీ డిజాస్టర్ వస్తే హీరోలలో ఒక తెలియని నిరాశ నిస్పృహలు కనిపిస్తాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం వాటిని తన దగ్గరికు రాకుండా చూసుకుంటున్నాడు. హిట్టు ఫ్లాపు సమానంగా చూడాలని ఆయనే అందరికీ చెప్తుంటాడు. ఆచార్య విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమా భారీ నష్టాలనే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ప్రభావం తర్వాత సినిమాపై పడకుండా జాగ్రత్త పడుతున్నాడు చిరంజీవి. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు. అందులో గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు అయిపోయింది. కేవలం ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. జూలై మొదటి వారంలో దీన్ని కూడా పూర్తి చేయనున్నాడు దర్శకుడు మోహన్ రాజా.
దీంతో పాటు మెహర్ రమేష్ భోళా శంకర్.. బాబి వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ సినిమా విషయంలో చిరంజీవి ప్లానింగ్ చూస్తే అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో.. తెలుగుతో పాటు హిందీలో కూడా దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగులో ఎలాగూ చిరంజీవి ఉన్నాడు కాబట్టి బిజినెస్‌కు ఢోకా లేదు. ఇప్పుడు సల్మాన్ పేరు చెప్పి హిందీలో కూడా అదిరిపోయే బిజినెస్ చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు ఏకంగా 45 కోట్లకు అమ్ముడైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఇదే నిజమైతే సినిమా బడ్జెట్ మొత్తం కేవలం హిందీ రైట్స్ రూపంలోనే వచ్చినట్లే. గాడ్ ఫాదర్ సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తున్నాడు చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే గాడ్ ఫాదర్ కనీసం 50 కోట్ల లాభాలు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నటీనటుల ఎంపిక విషయంలో చిరంజీవి మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అన్ని భాషల నటులను తీసుకోవడం వల్ల.. సినిమాను మిగిలిన భాషల్లో కూడా విడుదల చేసే అవకాశం లభించింది. మలయాళంలో ఆల్రెడీ చూశారు కాబట్టి తెలుగు, తమిళం, హిందీలో గాడ్ ఫాదర్ ఒకేసారి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
Chiranjeevi | రజినీకాంత్‌ను చిరంజీవి ఇమిటేట్ చేస్తే..ఇట్టా ఉంటది..వీడియో హల్చల్”
Chiranjeevi | సెకండాఫ్ మార్చాలని అభిమానికి చిరంజీవి సూచన..?”