ఒకరు తన యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్..మరొకరు ఒక్క స్టైల్‌తోనే అంతకుమించిన అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్..ఈ ఇద్దరికి సంబంధించిన న్యూస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇపుడలాంటి అప్డేట్ ఒకటి నెట్టింట్లోహల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆహా పాపులర్ సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఫినాలే (Telugu Indian Idol Mega Finale) ఎపిసోడ్‌కు చీఫ్ గెస్టుగా హాజరైన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth )ను ఇమిటేట్ చేసి ఔరా అనిపించాడు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో చిరంజీవి స్టైజ్ మీదకు రజినీకాంత్ పాపులర్ బీజీఎం ప్లే అవుతుండగా..తలైవాలా నడుచుకుంటూ అందరినీ షాక్ అయ్యేలా చేశాడు. ఇతడు నా అభిమాని కాదు..రజినీకాంత్‌కు అభిమాని అంటూ స్టేజ్ మీదున్న వ్యక్తినుద్దేశించి అంటున్నాడు చిరు.
ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరోను ఇమిటేట్ చేయడం చాలా అరుదుగా కనిపించే విషయం. రజినీకాంత్ బీజీఎంకు చిరు వాకింగ్ చేస్తే ఎట్లుంటది…ఇట్టా ఉంటది..అనే క్యాప్షన్‌తో ఆహా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది. చిరంజీవి, రజినీకాంత్ ఒకే ఫ్రేములోనే ఉన్నారా..? అన్నట్టుగా సాగుతున్న ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.