Chiranjeevi | ఆ విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం..ఇంతకీ అదేంటో..?
రీ ఎంట్రీ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఒకేసారి నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యాడు మెగాస్టార్. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ స్థాయి మాస్ సినిమా చిరంజీవి నుంచి రాలేదు. మధ్యలో వచ్చిన సైరా పీరియాడికల్ సబ్జెక్ట్ అయితే..మొన్న వచ్చిన ఆచార్య (Acharya)పూర్తిగా నక్సలిజం నేపథ్యంలో సాగింది.
చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఒకేసారి నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యాడు మెగాస్టార్. వాటిని అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు కూడా. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ స్థాయి మాస్ సినిమా చిరంజీవి నుంచి రాలేదు. మధ్యలో వచ్చిన సైరా పీరియాడికల్ సబ్జెక్ట్ అయితే.. మొన్న వచ్చిన ఆచార్య (Acharya) పూర్తిగా నక్సలిజం నేపథ్యంలో సాగింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.
మరీ ముఖ్యంగా ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 60 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.ఈ సినిమా తర్వాత చిరంజీవి ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న అన్నయ్య.. ఇక మీదట అలా చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాతే కొత్త కథలు వినాలని మెగాస్టార్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గాడ్ ఫాదర్ (God Father), వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలపై ఫోకస్ చేయనున్నాడు చిరంజీవి. ఆ తర్వాతే వెంకీ కుడుముల సినిమా గురించి ఆలోచించనున్నాడు. ఈ సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతం చిరంజీవి ఇమేజ్ కు సరిపోయే కథ సిద్ధం చేసే పనిలో వెంకీ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు పూర్తయిన తర్వాతే మిగిలిన సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు అన్నయ్య.
అందుకే ఈ మధ్య కొందరు దర్శకులు కథలు చెప్పాలని ప్రయత్నించినా కూడా సున్నితంగా తిరస్కరించాడు. ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కన్ఫ్యూజన్ తప్ప ఇంకేమీ ఉండదని మెగాస్టార్ భావిస్తున్నాడట. మొత్తానికి చిరంజీవిలో వచ్చిన ఈ మార్పు రాబోయే సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో చూడాలి.
Read Also : Anand Mahindra | సర్కారు వారి పాట చూసేందుకు న్యూజెర్సీకి వెళతా..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Read Also : Shahrukh Khan | మీడియాకు దూరంగా స్టార్ హీరో..కారణమేంటో..?
Read Also : F3 Collections | తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో ‘ఎఫ్ 3’ హవా..కలెక్షన్లు ఇవే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

