కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao)..సినీ లవర్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. విలన్‌గా భయపెట్టడంలోనైనా..కామెడీతో కడుపుబ్బా నవ్వించడంలోనైనా..క్యారెక్టర్ ఆర్టిస్టుగా కన్నీళ్లు పెట్టించడంలోనైనా కోట స్టైలే వేరు. సినీ రంగంలో రాణించాలనుకునే అప్ కమింగ్ యాక్టర్లలో చాలా మంది కోటశ్రీనివాస రావును కూడా స్పూర్తిగా తీసుకుంటారు. వయస్సు మీద పడుతున్నా ఇప్పటికీ యాక్టింగ్ చేస్తూ..యువ నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కోట శ్రీనివాస రావు అప్పుడపుడు కాంట్రవర్సియల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారని తెలిసిందే.
కొన్నిసార్లు అనవసర విమర్శలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోతుంటారు. చిరంజీవి (Chiranjeevi) ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం కంటే పేద సినీ కార్మికులకు సహాయం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని.. ఇటీవలే కోట శ్రీనివాస రావు సూచించారు. ఇక తాజాగా చిరంజీవి తనయుడు రాంచరణ్ (Ram Charan) యాక్టింగ్‌పై మాట్లాడి..మరోసారి వార్తల్లోకెక్కారు కోట. చరణ్ కేవలం జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగానే ఈ స్థాయికి వచ్చారు.
రాంచరణ్‌కు మంచి పాత్ర దొరికితే యాక్టర్‌గా తన పూర్తి టాలెంట్‌ను చూపించే అవకాశముందని అభిప్రాయపడ్డారు కోట. అయితే కోట శ్రీనివాస రావు చేసిన ఈ కామెంట్లతో కొందరు మెగా అభిమానులు అంతృప్తికి లోనవుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
Read Also : Shraddha Das | ‘చిట్టి నడుమునే చూస్తున్నా..చిత్రహింసలో చస్తున్నా’
Read Also : #Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్
Read Also : Sathi First Look | ‘సతి’ ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచేస్తున్న ఎంఎస్ రాజు