#Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్
ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మహేశ్ బాబు (Mahesh Babu) . మహేశ్ ట్విటర్లో #Whatshappening ఇంటర్వ్యూలో పాల్గొనగా..ఆ వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇంటర్వ్యూలు, ఇతర కార్యక్రమాలతో బిజీ అయిపోయాడు. మహేశ్ ట్విటర్లో #Whatshappening ఇంటర్వ్యూలో పాల్గొనగా..ఆ వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ట్విటర్‌కు సంబంధించిన కొన్ని ఫన్నీ ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలిచ్చాడు సూపర్ స్టార్. మొదట హాయ్ నేను మహేశ్ బాబు వాట్స్ హ్యాపెనింగ్..అంటూ అందరినీ పలుకరించాడు.
మీ గురించి హ్యాష్ ట్యాగ్‌తో ఒక్కమాటలో చెప్పండని అడుగగా..సైలెన్స్ అండ్ ఫోకస్ అంటూ రిప్లై ఇచ్చాడు. మిమ్మల్ని ఓ ఎమోజీలో చూడాలంటే..నవ్వుతూ అని సమాధానమిచ్చాడు. ట్విటర్లో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారని ప్రశ్నించగా..ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన సతీమణి నమ్రత ట్విటర్లో జాయిన్ కావాలనుకుంటున్నానని, వెంటనే ఆమెను ఫాలో అవుతానని చెప్పాడు.
సర్కారు వారి పాట గురించి ఒక్క ట్వీట్ లో ఎలా చెప్తారనగా..అభిమానులు ఈ వేసవికి సినిమాను హిట్ చేస్తున్నారని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ఇపుడీ వీడియో ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Here's #WhatsHappening! pic.twitter.com/zGF6s5crdk
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

