Carrot Oil | క్యారెట్ అనగానే కూరగాయగానే మనకు తెలుసు. మహా అయితే సలాడ్లలో వాడతాం. కానీ క్యారెట్ నూనె జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. మాడును తేమగా ఉంచి, వెంట్రుకలు రాలిపోకుండా ( Hairfall ) కాపాడుతుంది. ఈ నూనెలో సుగుణాలెన్నో! క్యారెట్ గింజలు లేదా వేళ్ల నుంచి క్యారెట్ ఆయిల్‌ను తీస్తారు. ఇలా తీసిన నూనె గాఢత ఎక్కువ కనుక, కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్లో కలిపి ఉపయోగిస్తారు.
› క్యారెట్ నూనెలో విటమిన్-ఎ, ఇ తో పాటు బీటాకెరోటిన్లు అధికం. దీంతో జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. ఈ విటమిన్లు జుట్టును కాలుష్యకారకాలు, యూవీ కిరణాల నుంచి కాపాడతాయి.
› ఈ నూనెకు యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి, మాడు మీద తిష్ఠవేసిన ఫంగస్, బ్యాక్టీరియాలాంటి వాటిని నాశనం చేసి చుండ్రును
నివారిస్తుంది.
› ఇది వెంట్రుకల పైపొరను పునరుజ్జీవింపజేసి, జుట్టును బలంగా తయారు చేస్తుంది.
› రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. వెంట్రుకల కుదుళ్లను బలంగా చేస్తుంది. జుట్టు చిట్లకుండా, రాలకుండా కాపాడుతుంది.
Hairfall | తలస్నానం చేస్తున్నారా? ఇలా చేస్తే జుట్టు రాలిపోవడం ఖాయం !!”
Hair fall | రోజూ ఈ గింజలు తింటే మీ జుట్టు పట్టులా దృఢంగా అవుతుంది !!”
“Hair fall | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నదా.. ఈ టిప్స్ మీకోసమే !!”