Hairfall | తలస్నానం చేస్తున్నారా? ఇలా చేస్తే జుట్టు రాలిపోవడం ఖాయం !!
Hairfall | జుట్టు తడిగా ఉన్నప్పుడు కుదుళ్లు బలహీనంగా మారతాయి. ఇలాంటి సమయంలో తల దువ్వుకోవడం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. జుట్టు పొడిబారుతుంది. మెరుపును కోల్పోతుంది. ఈ సమస్యకు పరిష్కారాలు అనేకం.
తడి నెత్తిని దువ్వుకోవడం: జుట్టు తడిగా ఉన్నప్పుడు వెంట్రుకలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. తల స్నానం తర్వాత చిక్కులు పడిన వెంట్రుకలకు కొబ్బరినూనె పట్టించాలి. ఆ తర్వాతే వెడల్పాటి పండ్లు ఉన్న దువ్వెనతో చిక్కులు తీసుకోవాలి. అలా అని తల పూర్తిగా ఆరిపోయే వరకు దువ్వుకోకుండా ఉండకూడదు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మెరుపును కోల్పోతాయి.
టవల్‌తో గట్టిగా రుద్దడం: తలస్నానం కారణంగా కుదుళ్లు బలహీనంగా మారతాయి. సున్నితంగా రుద్దినా జుట్టు ఊడిపోయే ఆస్కారం ఉంది. ఇక టవల్‌తో మరీ గట్టిగా తుడుచుకుంటున్నామంటే, చాలా నష్టం కలిగిస్తున్నట్లే. దీనికి బదులుగా టవల్‌తో మాడును నెమ్మదిగా నీళ్లు ఇంకిపోయేలా ఒత్తుకోవాలి. అంతేకాదు, తలస్నానం తర్వాత తలకు టవల్ చుట్టు కోకూడదు. ఇలా చేస్తే చుండ్రు చేరే ప్రమాదం ఉంది.
తడి వెంట్రుకలను బిగించడం: తడిగా ఉన్నప్పుడు పోనీటెయిల్‌లా కట్టుకోవడం లేదా ముడివేసుకోవడం వల్ల కేశాలు పెళుసుబారుతాయి. సగం ఆరిన దశలో కూడా జుట్టును ముడి వేసుకోవద్దు. పూర్తిగా ఆరిపోయేంత వరకు వేచి చూడాలి. ఆ తర్వాత నచ్చినట్లు జడ వేసుకోవచ్చు.

డ్రైయర్ల వాడకం: తడి జుట్టును ఆరబెట్టుకోవడానికి చాలామంది డ్రైయ్యర్లను వాడుతుంటారు. దీనివల్ల ఆ వేడికి కేశాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి, నీళ్లు కారిపోయేవరకు ఆగి, ఆ తర్వాత.. తక్కువ ఉష్ణోగ్రత వద్ద తలను ఆరబెట్టుకోవాలి. ఆవిరి బయటికి వచ్చేంత వరకూ డ్రైయ్యర్లను వాడటమూ మంచిది కాదు. దీనివల్ల వెంట్రుకలు కాలిపోయే ప్రమాదం ఉంది. తడి పూర్తిగా ఆరిపోయేవరకు అలాగే ఉండాలి. ఆ తర్వాత మాత్రమే డ్రైయ్యర్లను ఉపయోగించాలి.
నీళ్లు ఆరకుండానే పడుకోవడం: ఇలా చేయడం వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి. పడిశెం పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థకు నష్టం జరుగుతుంది. మరుసటి రోజు పొద్దున జడ వేసుకోవడమూ ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని, తల పూర్తిగా ఆరిన తర్వాతే నిద్రపోవడం మంచిది.
Read More :
Hair fall | రోజూ ఈ గింజలు తింటే మీ జుట్టు పట్టులా దృఢంగా అవుతుంది !!”
“Hair fall | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నదా.. ఈ టిప్స్ మీకోసమే !!”
“Dandruff | చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? పెరుగుతో ఇలా చేసి చూడండి”
Hair fall | జుట్టు రాలడం తగ్గాలా? ఉల్లిగడ్డలతో ఇలా చేస్తే సరి..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

