తల్లిదండ్రుల శ్రాద్ధం నదీ తీరంలో పెట్టవచ్చా? ఇంట్లోనే పెట్టాలా? l విజయ్, నిజామాబాద్
తల్లిదండ్రుల పుణ్యతిథి నదీతీరంలోనే చేయాలని నియమం లేదు. ఇంట్లో కూడా చేయవచ్చు. అయితే, నదీతీరంలో చేస్తే మరింత ప్రశస్తం అని శాస్త్రం చెబుతున్నది. ఆ నదీతీరం ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలమాట. తీర్థం, క్షేత్రం కలిసిన చోట ఆ నది పవిత్రత, ఆ క్షేత్రంలోని దేవుడి దీవెనలు కూడా పితృకార్యం సక్రమంగా సాగడానికి దోహదం చేస్తాయని అభిప్రాయం. శ్రద్ధతో నిర్వహించేది శ్రాద్ధం. జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులపట్ల కృతజ్ఞతగా భక్తిప్రపత్తులతో శ్రాద్ధం నిర్వహించాలి. శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత మరింత స్థిరం కావటానికి ఇంటికంటే నదీతీరం విశేషమని భావిస్తారు.
– శ్రీ