Alia Bhatt | తెలుగు సహా వివిధ భారతీయ భాషల్లో నటించి తనకంటూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్. మహేశ్‌భట్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైనా సొంత టాలెంట్‌తో ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నది. చేతినిండా సినిమాలు ఉన్నా.. తన ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలియదంటున్నది ఆలియా.
‘నేను చాలా సినిమాలు చేశాను. చేస్తున్నాను. వాటికి సంబంధించిన పని మాత్రమే నేను చూసుకుంటాను. కానీ, ఆ తర్వాత వచ్చే డబ్బు నిర్వహణ మీద మాత్రం పెద్దగా దృష్టి పెట్టను. నిజంగా చెప్పాలంటే నా బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందో నాకే తెలియదు. కానీ, మంచి మొత్తమే ఉంటుందని మాత్రం తెలుసు. నా ఆర్థిక వ్యవహారాల గురించి కొంచెమైనా తెలుసుకోమని నా టీమ్ చాలాసార్లు చెప్పింది. నేనైతే ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మొదటి నుంచీ డబ్బులకు సంబంధించిన సంగతులన్నీ అమ్మే చూసుకుంటున్నది. నాకు తొలి సినిమా పారితోషికంగా రూ.15 లక్షలు వచ్చాయి. ఆ చెక్ తీసుకెళ్లి అమ్మకు ఇచ్చి వాటిని నువ్వే మేనేజ్ చేయమని చెప్పాను. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ బాధ్యత అమ్మదే. ఇక, ఇప్పుడు నేను కూడా అమ్మను అవుతున్నాను కాబట్టి మెల్లిగా ఆ కోణంలో దృష్టి సారించాలని అనుకుంటున్నా. సాధారణంగా నేను డబ్బు ఎక్కువగా ఖర్చు చేయను. అందుకే ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటూ, కాస్త ఖర్చు కూడా చేస్తూ రిలాక్స్ అవ్వమని మా చార్టర్డ్ అకౌంటెంట్ చెబుతుంటారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి తీసిన తొలి సినిమా ‘బ్రహ్మాస్త్ర’ త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే!
“Alia Bhatt | అలియాభట్ సోషల్ మీడియా పోస్ట్ చాలా కాస్లీ గురూ..!”
“Alia Bhatt | హిందీ సినిమాలను తీసిపారెయొద్దు : అలియా భట్”