Alia Bhatt | అలియాభట్ సోషల్ మీడియా పోస్ట్ చాలా కాస్లీ గురూ..!
అందం, అభినయంతోపాటు పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్, ఫీ మేల్ సెంట్రిక్ సినిమాలతో తనకంటూ కోట్లాదిమంది ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ నటి అలియాభట్ (Alia Bhatt). సోషల్ మీడియాలో ఈ భామను అనుసరించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ (Indian film industry)లో ఉన్న హీరోయిన్లలో వన్ ది లీడింగ్ బ్యూటీ బాలీవుడ్ నటి అలియాభట్ (Alia Bhatt). అందం, అభినయంతోపాటు పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్, ఫీ మేల్ సెంట్రిక్ సినిమాలతో తనకంటూ కోట్లాదిమంది ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకుంది అలియా భట్. సోషల్ మీడియాలో ఈ భామను అనుసరించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది.
అంతేకాదు ఈ బ్యూటీ నెట్టింట్లో పెట్టే పోస్ట్ చాలా ఖరీదైంది. తాజాగా వచ్చిన ఓ అప్డేట్ ఈ విషయాన్ని చెబుతోంది. ఇన్ఫ్ల్యుయెన్సర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం అలియాభట్ ఒక్క సోషల్ మీడియా యాడ్ (Social media post) లేదా పోస్ట్‌కు రూ.85 లక్షలు నుంచి రూ.కోటి వరకు చార్జ్ చేస్తుందట. డఫ్ అండ్ ఫెల్ప్స్ (Duff and Phelps) సెలబ్రిటీ వాల్యుయేషన్ రిపోర్టు-2021 ప్రకారం (బ్రాండ్ వాల్యూ విషయంలో) టాప్ -10 జాబితాలో అలియాభట్ అత్యంత పిన్న వయస్కురాలు కావడం విశేషం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కోస్టార్ రణ్‌బీర్‌కపూర్ ను పెళ్లి చేసుకుంది అలియాభట్. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్లో సీత పాత్రలో మెరిసింది. అలియా నటించిన డార్లింగ్స్ చిత్రం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై..మంచి స్పందన తెచ్చుకుంటోంది. మరోవైపు రణ్ బీర్‌తో కలిసి నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

