బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి షంషేరా (Shamshera). రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఫన్ ఇంటర్వ్యూ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సెషన్లో ఒక అబద్దం, రెండు నిజాలు చెప్పాలని రణ్వీర్ను అక్కడున్నవారు అడిగారు. దీనికి రణ్‌బీర్ స్పందిస్తూ..తనకు ఇద్దరు ట్విన్స్ (Twins) ఉన్నారని చెప్పాడు. అలాగే తాను మైథలాజికల్ సినిమా చేస్తున్నానని, త్వరలో సుదీర్ఘ విరామం కూడా తీసుకోబోతున్నానని చెప్పుకొచ్చాడు.
తాను చెప్పిన వాటిలో ఒకటి అబద్దం అన్నాడు రణ్‌బీర్. అయితే రణ్‌బీర్ చెప్పిన ఈ మూడు విషయాల్లో ఏది అబద్దం, ఏది నిజమనేది పక్కన పెడితే..వీటిలో ట్విన్స్ (కవలలు) విషయం మాత్రం నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అలియాభట్ (Alia Bhatt) ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ప్రెగ్నెన్సీని ప్రకటించిస్తూ..పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తనకు కవలలు ఉన్నారనే వార్తలను కొట్టిపారేశాడు రణ్ బీర్ కపూర్.
దయచేసి ఇలాంటి పుకార్లను సృష్టించవద్దని, ఈ టాపిక్‌ను పక్కన పెట్టాలని మీడియాను కోరాడు రణ్ బీర్ కపూర్. రణ్‌బీర్-అలియా (Alia Bhatt)నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలియాభట్ నటిస్తోన్న డార్లింగ్స్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా..మరో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.